STOCKS

News


సగం సంస్థల్లో డేటా రక్షణ కరవే!

Wednesday 11th July 2018
news_main1531329056.png-18231

ముంబై: దేశంలో సగం కంపెనీలు డేటా రక్షణ పరంగా సరైన చర్యలు తీసుకోలేదని ఓ సర్వేలో వెల్లడైంది. అలాగే, సున్నితమైన డేటా నిల్వ కూడా సరిగా లేదని డిజిటల్‌ సెక్యూరిటీ సంస్థ ‘జెమాల్టో’ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘‘భారత్‌లో 48 శాతం ఐటీ నిపుణులు తాము పనిచేస్తున్న సంస్థలు డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా విధానాలను కొనసాగించడం లేదని భావిస్తున్నారు. కేవలం 48 శాతం కంపెనీలే తమ సున్నితమైన డేటా ఎక్కడ ఉంచుతున్నదీ తెలుసుకొని ఉంటున్నాయి’’ అని ఈ సర్వే పేర్కొంది. ఇక 45 శాతం కంపెనీలు తాము భద్రపరుస్తున్న వినియోగదారుల డేటాను వర్గీకరించడం, విశ్లేషించడం చేయడం లేదని తెలిసింది. ‘‘కంపెనీలు తాము సేకరిస్తున్న డేటాను విశ్లేషించకపోతే దాని విలువను అవి అర్థం చేసుకోలేవు. దాంతో ఆ డేటాకు తగిన రక్షణ చర్యలు ఎలా తీసుకోవాలన్నది వాటికి తెలియదు’’ అని జెమాల్టో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జాసన్‌హర్ట్‌ తెలిపారు. 



You may be interested

నెట్ న్యూట్రాలిటికి ఓకే..

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్‌ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన సమావేశంలో ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్స్‌, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. టెలికం కమిషన్

ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌ డీల్‌ సెప్టెంబర్‌ కల్లా పూర్తి !

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ఎల్‌ఐసీ మెజారిటీ వాటాను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఐఆర్‌డీఏఐ నుంచి ఎల్‌ఐసీ ఇటీవలే ఆమోదం పొందటం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంక్‌ ఆస్తులు, అప్పులు, తదితర అంశాలపై ప్రస్తుతం ఎల్‌ఐసీ మదింపు నిర్వహిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌ మైనారిటీ వాటాదారుల కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించే

Most from this category