STOCKS

News


నిధుల సమీకరణ వేటలో జీవికే పవర్‌

Saturday 17th November 2018
news_main1542436465.png-22138

- రూ.8000 కోట్లకు వాటాదారుల ఆమోదం

ముంబై:- మౌలిక రంగ సంస్థ జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.8,000 కోట్ల నిధుల సమీకరణకు వాటాదారుల నుంచి అనుమతి పొందింది. గత బుధవారం జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో వివిధ మార్గాల ద్వారా మొత్తం నిధుల సమీకరణకు వాటాదారులు ఆమోదం తెలినట్లు జీవీకే పవర్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. కంపెనీకి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకం, వివిధ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, లీజులు, ఆస్తుల తనఖాతో పాటు అందులోబాటలో ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని ఈ మొత్తం నిధులను సమీకరించే యోచనలో కంపనీ ఉంది. ఇందుకు వాటాలు, సెక్యూరిటీలను కూడా ఉపయోగించుకోవడానికి వీలుంది. సమీకరించిన నిధులను కంపెనీ ఆర్థిక అవసరాలకు, బుణాల చెల్లింపులకు, తన అనుబంధ సంస్థలకు నిధుల కేటాయింపులకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇదే వార్షిక సమావేశంలో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ 50శాతం ఈక్విటీ వాటా తగ్గింపునకు షేర్లహోల్లర్ల  అనుమతలు కోరినట్లు ఎక్చ్సేంజీలకు తెలిపింది. జీఎంఆర్‌ గ్రూపు సబ్సీడరీని ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు పెట్టడం లేదా ప్రయివేటు ప్లేస్‌మెంట్‌ లేదా వాటా విక్రయం చేయనున్నారు.



You may be interested

భారత్‌కు ఇది పెద్ద పాజిటివ్‌..

Saturday 17th November 2018

ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితులు భారత్‌కు సానుకూలమని కోటక్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పతనం కావడం ఇండియాకు అతిపెద్ద పాజిటివ్‌ అంశమని తెలిపింది. ఆయిల్‌ ధరలు ప్రస్తుత స్థాయిల్లోనే కదలాడితే దేశ స్థూల ఆర్థికాంశాలు మరింత మెరుగుపడుతాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు కంపెనీల ఆర్థిక ఫలితాలు ఎర్నింగ్స్‌ రికవరీని సూచిస్తున్నాయని తెలిపింది. నిఫ్టీ-50 ఇండెక్స్‌ నికర లాభం వార్షిక ప్రాతిపాదికన 10

పొందికగా సొంతిల్లు

Saturday 17th November 2018

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో నగరాల్లో విశాలమైన విస్తీర్ణాల్లోని ఇల్లు కొనాలంటే మధ్య తరగతివాసులకు కష్టమే. చిన్న ఫ్లాట్లనూ కొనుగోలు చేసినా సరే.. కాస్త పొందికగా ఇంటీరియర్‌ను అమర్చుకుంటే చాలు! ఇల్లు విశాలంగా కనిపిస్తుంది.  ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్‌ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్‌ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్‌ సేవింగ్‌ ఫర్నీచర్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్‌

Most from this category