STOCKS

News


గల్ఫ్‌ ఆయిల్‌ లాభం రూ.40 కోట్లు

Tuesday 13th November 2018
news_main1542084884.png-21923

హైదరాబాద్‌: సెప్టెంబరు క్వార్టరులో గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ నికరలాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికం స్థాయిలోనే రూ.40 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 29 శాతం అధికమై రూ.417 కోట్లకు ఎగసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు కాలంలో రూ.807 కోట్ల టర్నోవరుపై రూ.80 కోట్ల నికరలాభం సాధించింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 0.03 శాతం పెరిగి రూ.760.35 వద్ద స్థిరపడింది.



You may be interested

సింగపూర్‌ ఫిన్‌టెక్‌ వేడుకలో ప్రధాని మోదీ ప్రసంగం

Tuesday 13th November 2018

సింగపూర్‌: సింగపూర్‌లో జరిగే ప్రపంచవ్యాప్త అతిపెద్ద ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల సమ్మేళనంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ ఫిన్‌టెక్‌ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్‌ కంపెనీలకు చెందిన సుమారు 30,000 మంది ఇందులో పాల్గొంటారు. ప్రపంచంలో ఇంత భారీ సమ్మేళనం మరొకటి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మన దేశం నుంచి 400 మంది హాజరుకానున్నారు. అలాగే, 18 కంపెనీలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతా లేకపోయినా

తగ్గిన హెచ్‌బీఎల్‌ పవర్‌ లాభం

Tuesday 13th November 2018

సెప్టెంబరు త్రైమాసికంలో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 41.7 శాతం తగ్గి రూ.5.95 కోట్లకు పరిమితమయింది.  టర్నోవరు రూ.445 కోట్ల నుంచి రూ.334 కోట్లకు వచ్చి చేరింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 0.80 శాతం తగ్గి రూ.31.10 వద్ద స్థిరపడింది.

Most from this category