News


గల్ఫ్‌ ఆయిల్‌ నుంచి రెండు కొత్త బ్యాటరీలు

Wednesday 21st November 2018
news_main1542776363.png-22253

అహ్మదాబాద్‌: లూబ్రికెంట్ల తయారీ సంస్థ గల్ఫ్‌ ఆయిల్‌... రెండు కొత్త టూ-వీలర్‌ బ్యాటరీలను మార్కెట్లోకి తెచ్చింది. బ్యాటరీల వ్యాపారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడైన క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా సమక్షంలో ఈ గల్ఫ్‌ ప్రైడ్‌ బ్యాటరీలను కంపెనీ ఆవిష్కరించింది. టూ-వీలర్‌ బ్యాటరీ మార్కెట్లో తమ వాటాను క్రమంగా పెంచుకుంటున్నామని గల్ఫ్‌ ఆయిల్‌ ఎండీ రవి చావ్లా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల రీప్లేస్‌మెంట్‌ మార్కెట్లో తమ వాటా 1.5 శాతానికి పెరిగిందన్నారు. నెలకు రూ.50,000 వరకూ బ్యాటరీలను విక్రయిస్తున్నామని, ప్రస్తుతం వీటిని దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఏడాదికి 15 లక్షల బ్యాటరీల అమ్మకాలు మైలురాయిని సాధిస్తే బ్యాటరీల తయారీని భారత్‌లోనే ప్రారంభిస్తామని చెప్పారు. దీన్ని రెండేళ్లలో సాధించగలమని విశ్వాసం వ్యక్తంచేశారు.
 



You may be interested

పీఎస్‌బీలకు తగ్గనున్న మూలధన భారం

Wednesday 21st November 2018

ముంబై: మూలధన పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిల్వలను (సీసీబీ) తగిన స్థాయిలో సమకూర్చుకునేందుకు మరింత గడువు లభించడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై (పీఎస్‌బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్ల మేర భారం తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌బీల మూలధన అవసరాల అంచనాలు రూ.1.2 లక్షల కోట్ల నుంచి రూ. 85,000 కోట్లకు తగ్గుతాయని వివరించింది. అయితే, బ్యాంకుల

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రేసులో ఐదు కంపెనీలు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: భారీ రుణ భారంతో దివాల ప్రక్రియను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను టేకోవర్‌ చేయడానికి ఐదు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఎన్‌బీసీసీ, కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌, సురక్ష గ్రూప్‌లు ఈ టేకోవర్‌ రేస్‌లో ఉన్నాయి.  తాజా బిడ్‌లు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను టేకోవర్‌ చేయడానికి రూ.7,000 కోట్లతో సురక్ష గ్రూప్‌ గతంలోనే బిడ్‌ను సమర్పించింది. ఈ బిడ్‌ను జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ రుణదాతలు తిరస్కరించారు.

Most from this category