STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల కొనుగోలుపై త్వరలోనే మార్గదర్శకాలు

Monday 15th July 2019
news_main1563170454.png-27064

న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ రంగం లిక్విడిటీ సమస్యల్లో ఉండడంతో, ఈ రంగంలోని కంపెనీల నుంచి రుణ ఆస్తులను కొనుగోలు చేసే విషయమై ప్రభుత్వరంగ బ్యాంకులకు త్వరలోనే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆర్థిక శాఖలోని రెండు ప్రధాన విభాగాల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తుల కొనుగోలు అర్హత నిబంధనలను ఈ వారం లేదా వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా బలమైన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి, రూ.లక్ష కోట్ల వరకు అధిక రేటింగ్‌ కలిగిన ఆస్తులను ప్రభుత్వరంగ బ్యాంకులు కొనుగోలు చేయనున్నట్టు బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 



You may be interested

ఇండిగో లొసుగులపై సెబీ దృష్టి

Monday 15th July 2019

- రంగంలోకి కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా - గంగ్వాల్‌ ఆరోపణలపై వివరణకు ఆదేశించే అవకాశాలు న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేష్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు

కరెన్సీ నోట్లను గుర్తించేందుకు మొబైల్ యాప్‌

Monday 15th July 2019

ఆర్‌బీఐ కసరత్తు న్యూఢిల్లీ: చూపులేని వారు సైతం కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించగలిగేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. దీని రూపకల్పన కోసం యాప్స్ తయారీ సంస్థల నుంచి బిడ్స్‌ ఆహ్వానించింది. మొబైల్ ఫోన్ కెమెరా ముందు నోటును ఉంచితే.. దాని విలువను తెలియజేసే విధంగా యాప్‌ ఉండాలని ప్రతిపాదించింది. ఒకవేళ కరెన్సీ నోటును కెమెరా ముందు సరైన యాంగిల్‌లో ఉంచని పక్షంలో ఆ

Most from this category