STOCKS

News


గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ విస్తరణ

Tuesday 9th October 2018
news_main1539058681.png-20947

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ భారీగా విస్తరిస్తోంది. పౌల్ట్రీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో రెండు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పౌల్ట్రీ కంపెనీకోసం వీటిని నిర్మించనున్నట్టు గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఎండీ గుబ్బ నాగేందర్‌ రావు సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో 2 కోట్ల కోడిగుడ్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఇవి ఉంటాయన్నారు. ఫార్మా రంగాల కోసం ప్రత్యేకంగా వైజాగ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో నిల్వ కేంద్రాలను స్థాపిస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌ సమీపంలో ఫార్మా కోసం రెండు గిడ్డంగులు, సీడ్‌ కంపెనీల కోసం జెర్మ్‌ప్లాసం బ్యాంక్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.
పెట్టుబడి పెడితే చాలు..
కమాడిటీ ట్రేడింగ్‌లో 139 ఏళ్లుగా ఉన్న గుబ్బ గ్రూప్‌ 1987లో తొలి గిడ్డంగిని నెలకొల్పింది. ప్రస్తుతం 17 సెంటర్లను నిర్వహిస్తోంది. ఇందులో 14 మల్టీ కమాడిటీ గిడ్డంగులు. వీటన్నిటి సామర్థ్యం 1,20,000 టన్నులు. సంఖ్య, సామర్థ్యం పరంగా దేశంలో గుబ్బ గ్రూప్‌ అతి పెద్దది. హైదరాబాద్‌ సమీపంలోని అన్నారం వద్ద 7,000 టన్నుల సామర్థ్యంతో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ కమాడిటీ స్టోరేజ్‌ సెంటర్‌ నవంబరులో ఆరంభమవుతుందని నాగేందర్‌ రావు తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారులు పెట్టుబడి పెడితే చాలు. గిడ్డంగులను నిర్మించి మేమే నిర్వహిస్తాం. భాగస్వామికి ప్రతినెలా ఆదాయం సమకూరుతుంది’ అని చెప్పారు. పాత గిడ్డంగులను కొనుగోలు చేసేందుకూ సిద్ధమన్నారు. కంపెనీలో 230 మంది ఉద్యోగులున్నారు.

 



You may be interested

రైతు మార్కెట్లలో కోల్డ్‌ స్టోరేజీలు

Tuesday 9th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కూరగాయలు, పండ్ల హోల్‌సేల్‌ మార్కెట్లలో చిన్నపాటి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తాము సిద్ధమని చాంబర్‌ ఆఫ్‌ కోల్డ్‌ స్టోరేజెస్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. ప్రభుత్వం స్థలం సమకూరిస్తే కోల్డ్‌ స్టోరేజీలను తాము సొంత ఖర్చుతో నిర్మిస్తామని చాంబర్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ గుబ్బ నాగేందర్‌ రావు చెప్పారు. ఇక్కడి హైటెక్స్‌లో నవంబరు 16-17 తేదీల్లో జరుగనున్న ఇండియా కోల్డ్‌ చైన్‌ ఎక్స్‌పో, ట్రేడ్‌ షో (ఐసీఈ) వివరాలను సోమవారం

టెల్కోలకు రూపాయి దెబ్బ

Tuesday 9th October 2018

ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్‌ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్‌ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో

Most from this category