STOCKS

News


జీఎస్‌కే మొత్తం ఆదాయం రూ.831 కోట్లు

Tuesday 23rd October 2018
news_main1540270976.png-21391

న్యూఢిల్లీ: గ్లాక్సో స్మిత్‌లైన్‌ (జీఎస్‌కే)ఫార్మాస్యూటికల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.101 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.130 కోట్ల నికర లాభం వచ్చిందని, దాంతో పోలిస్తే తాజా క్వార్టర్లో లాభం 23 శాతం క్షీణించిందని జీఎస్‌కే ఫార్మా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.846 కోట్ల నుంచి రూ.831 కోట్లకు తగ్గింది. నికర లాభం తగ్గడంతో బీఎస్‌ఈలో జీఎస్‌కే ఫార్మా షేర్‌ 2 శాతం నష్టంతో రూ.1,390 వద్ద ముగిసింది. 



You may be interested

టాటా టెలీ రూ.28,651 కోట్ల పెట్టుబడులు రైటాఫ్‌

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: టాటాలకు చెందిన నష్టాల్లో ఉన్న టెలికం కంపెనీ టాటా టెలీ సర్వీసెస్‌కు ఊరటనిచ్చే నిర్ణయాన్ని టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ తీసుకుంది. టాటా టెలీ సర్వీసెస్‌ పెట్టిన మొత్తం రూ.28,652 కోట్ల పెట్టుబడులను రైటాఫ్‌ చేసింది. టాటా టెలీసర్వీసెస్‌కు చెందిన కన్సూమర్‌ మొబైల్‌ వ్యాపారాన్ని భారతీ ఎయిర్‌టెల్‌కు బదలాయించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎంటర్‌ప్రైజ్‌ సెగ్మెంట్‌ను టాటా గ్రూప్‌నకే చెందిన టాటా కమ్యూనికేషన్స్‌లో విలీనం చేసింది.

మొబీక్విక్‌తోనూ పసిడి కొనుగోళ్లు!

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: ఇక వినియోగదారులు ఈ-వాలెట్‌ సంస్థ మొబీక్విక్‌ ద్వారా కూడా  డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పేటీఎం తరువాత ఈ తరహా అవకాశాన్ని మొబీక్విక్‌ కల్పిస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా 2019-2020లో టన్ను పసిడి అమ్మకాలు లక్ష్యంగా మొబీక్విట్‌ తాజా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సేఫ్‌గోల్డ్‌తో మొబీక్విట్‌ జట్లుకట్టింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్లు పసిడి కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

Most from this category