STOCKS

News


గ్రూప్‌ఎమ్‌లో భారీ పునర్వ్యస్థీకరణ

Tuesday 29th January 2019
news_main1548736280.png-23867

హైదరాబాద్‌: డేటా సెంట్రిక్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్‌ఎమ్‌లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్‌ ఎమ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సౌత్‌ ఏషియా) ప్రశాంత్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రెసిడెంట్‌ గ్రోత్‌ అండ్‌  ట్రాన్స్‌ఫార్మేషన్‌గా (సౌత్‌ ఏషియా) తుషార్‌ వ్యాస్‌ నియమితులయ్యారు. అలాగే గ్రూప్‌ఎమ్‌ కంపెనీలో ఒక విభాగమైన మైండ్‌షేర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా (సౌత్‌ ఏషియా) పార్థసారధి మాం‍డ్యం, మైండ్‌ షేర్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా (సౌత్‌ ఏషియా) అమిన్‌ లఖానీ నియమితులయ్యారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పునర్వ్యస్థీకరణ తమ క్లయింట్ల విజయానికి మరింతగా దోహదపడగలదన్న ధీమాను గ్రూప్‌ఎమ్‌ వ్యక్తం చేసింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రశాంత్‌ కుమార్‌, తుషార్‌ వ్యాస్‌లు విజయవంతమైన ఫలితాలు అందించారని గ్రూప్‌ఎమ్‌ సౌత్‌ ఏషియా సీఈఓ శామ్‌ సింగ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



You may be interested

పీఎస్‌యూ బ్యాంకుల ఛీప్‌లతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

Tuesday 29th January 2019

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో జరగున్న తదుపరి మానిటరీ పాలసీ సమీక్షకు ముందు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకులతో సమావేశమయ్యారు. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి కోరుకుంటుందన్నది వారికి ఆయన తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ తన చివరి ద్వైమాసిక పాలసీ సమీక్షను ఫిబ్రవరి 7న ప్రకటించనుంది. ‘‘బ్యాంకింగ్‌ రంగం నుంచి ఆర్‌బీఐ ఏమి ఆశిస్తుందో వారికి తెలియజేయడం, బ్యాంకింగ్‌ రంగ పరిస్థితులపై

హెచ్‌బీఐఎస్‌ గ్రూపుతో టాటా స్టీల్‌ కీలక ఒప్పందం

Tuesday 29th January 2019

ఆగ్నేయ ఆసియా వ్యాపారాల్లో 70 శాతం వాటా అమ్మకం డీల్‌ విలువ రూ.3,408 కోట్లు న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ ఆగ్నేయ ఆసియాలోని తన వ్యాపారాల్లో మెజారిటీ వాటాను చైనాకు చెందిన హెచ్‌బీఐఎస్‌ గ్రూపునకు విక్రయించనుంది. ఇందుకు సంబంధించి హెచ్‌బీఐఎస్‌ గ్రూపు కంపెనీతో టాటా స్టీల్‌ అనుబంధ కంపెనీ టీఎస్ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్‌లోని నాట్‌స్టీల్‌ హోల్డింగ్స్‌ పీటీఈ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ (థాయిలాండ్‌) పబ్లిక్‌ కంపెనీ

Most from this category