STOCKS

News


జీఎంఆర్‌కు గ్రీస్‌ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్ట్‌

Saturday 22nd September 2018
news_main1537593193.png-20473

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు గ్రీస్‌ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్ట్‌ దక్కింది. ఈ మేరకు గ్రీస్‌ ప్రభుత్వం లేఖను అందించిందని జీఎంఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. క్రీటా ద్వీపంలోని హెరాక్‌లిఆన్‌ ఎయిర్‌పోర్ట్‌ డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తో పాటూ కార్యకలాపాల నిర్వహణ బాధ్యత కూడా జీఎంఆర్‌కే దక్కిందని జీఎంఆర్‌ గ్రూప్‌ ఎనర్జీ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ బిజినెస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని ఈక్విటీ రూపంలో, గ్రీస్‌ ప్రభుత్వ గ్రాంట్స్‌ ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరిస్తామని.. తొలి దశ నిర్మాణ వ్యయం సుమారు 520 మిలియన్‌ యూరోలు అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో జీఎంఆర్‌తో పాటూ జీఈకే టెర్నా పార్టనర్‌గా వ్యవహరిస్తుందని.. గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ రాయితీ  తొలి దశ ఐదేళ్లతో కలిపి.. 35 ఏళ్ల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 



You may be interested

మరో ల్యాంకో గ్రూపు కంపెనీపై ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌...

Saturday 22nd September 2018

సాక్షి, హైదరాబాద్‌ ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ దివాలా కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. తమకు చెల్లించాల్సిన రుణ బకాయి రూ.786.74 కోట్లను చెల్లించడంలో ల్యాంకో విదర్భ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ విఫలమైందని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌

400 బిలియన్‌ డాలర్లకు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 22nd September 2018

ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌) సెప్టెంబర్‌ 14తో అంతమైన వారానికి 1.207 బిలియన్‌ డాలర్లు పెరిగి 400.489 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఫారెక్స్‌ నిల్వలు 819 మిలియన్‌ డాలర్ల క్షీణతతో 399.282 బిలియన్‌ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌ 13తో ముగిసిన వారంలో నమోదైన 426 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు రికార్డు స్థాయి కాగా, ఆ తర్వాత నుంచి క్షీణత

Most from this category