News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో రూ.13,000 కోట్ల అవకతవకలు

Tuesday 5th March 2019
news_main1551760789.png-24430

  • గ్రాంట్‌ థార్న్‌టన్‌ ఆడిట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో రూ.13,000 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ సంస్థ ఆడిట్‌లో వెలుగు చూసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపునకు 24 డైరెక్ట్‌ సబ్సిడరీలతోపాటు, 135 పరోక్ష సబ్సిడరీలున్నాయి. అలాగే, ఆరు జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు, నాలుగు అసోసియేట్‌ కంపెనీలతో కూడిన ఈ గ్రూపునకు రూ.94,000 కోట్ల రుణ భారం ఉంది. మంజూరైన రుణాలను గ్రూపు కంపెనీలు అప్పటికే ఉన్న రుణాల చెల్లింపులకు 29 సందర్భాల్లో వినియోగించినట్టు ఆడిటింగ్‌లో తేలింది. ఈ మొత్తం రూ.2,502 కోట్లు అని గ్రాంట్‌ థార్న్‌టన్‌ నివేదిక పేర్కొంది. 2013 ఏ‍ప్రిల్‌ 1 నుంచి 2018 సెప్టెంబర్‌ 30 వరకు జరిగిన అధిక విలువ లావాదేవీలను ఈ నివేదిక ప్రస్తావించింది. రిస్క్‌ టీమ్‌ ప్రతికూల అంచనాలను పేర్కొన్నప్పటికీ రూ.2,400 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయడం జరిగినట్టు పేర్కొంది. అక్రమంగా జరిగిన పలు లావాదేవీల మొత్తం రూ.13,290 కోట్లని వెల్లడించింది. స్వల్ప కాల అవసరాల కోసం తీసుకున్న రూ.541 కోట్ల రుణాలను దీర్ఘకాల అవసరాల కోసం వినియోగించినట్టు ఈ సంస్థ గుర్తించింది. ‘‘అస్సెట్‌ లయబిలిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశ వివరాలను సమీక్షించడం ద్వారా నిధుల్లో అంతరాలను గుర్తించాం. ఈ వివరాల ఆధారంగా చూస్తే 2013 మే నుంచి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం మరిన్ని రుణాలను తీసుకునే ఒత్తిడిలో ఉందని తెలిసింది’’ అని గ్రాంట్‌ థార్న్‌టన్‌ నివేదిక పేర్కొంది. 2018 జూలైలో నిధుల పరంగా మరింత ఎక్కువ అంతరం ఉందని తెలిపింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ చైర్మన్‌ రవి పార్థసారధి 2018 జూలై 21న రాజీనామా చేయడం గమనార్హం. గతేడాది ఆగస్ట్‌ నుంచి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రుణ చెల్లింపులు చేయలేకపోవడంతో అక్రమాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.



You may be interested

కొచర్‌పై ‍కొనసాగుతున్న ప్రశ్నల వర్షం

Tuesday 5th March 2019

అక్రమ ధనార్జన కేసులో నాల్గవరోజు ఈడీ చర్యలు ముంబై: అక్రమ ధనార్జనా కేసులో సోమవారం వరుసగా నాల్గవరోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఐసీఐసీఐ బ్యాంక్‌ చీఫ్‌ చందాకొచర్‌ను ప్రశ్నించారు.  చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నాలుగురోజులుగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   వీడియోకాన్‌కు చెందిన కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగినట్లు ఉన్నత

లాభాలతో ప్రారంభం: క్షణాల్లో నష్టాల్లోకి

Tuesday 5th March 2019

మూడురోజుల విరామం తరువాత మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 123  పాయింట్ల లాభంతో 36,141 వద్ద, నిఫ్టీ 2  పాయింట్ల స్వల్పలాభంతో 10,865 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో తగ్గని ఉద్రిక్తతలు, మనదేశం నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై వాణిజ్య సుంకాలను విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన సూచీల ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన క్షణాల్లో

Most from this category