STOCKS

News


ఓయోలో రూ.700 కోట్ల గ్రాబ్‌ పెట్టుబడులు!

Tuesday 4th December 2018
news_main1543905819.png-22615

న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్‌ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్‌ రూ.700 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ వారంలోనే ఈ డీల్‌ కుదరవచ్చని సమాచారం. గ్రాబ్‌, ఓయో కంపెనీలు తమ కీలక మార్కెట్లుగా ఇండోనేషియాను, ఆగ్నేయాసియాలను గుర్తించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో కార్యకలాపాలు ప్రారంభించిన ఓయో... విస్తరణలో భాగంగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని అప్పుడే వెల్లడించింది. ఇండోనేషియాలో 35 నగరాలకు కార్యకలాపాలు విస్తరించనున్నామని ఓయో వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన రితేశ్‌ అగర్వాల్‌ గతంలో పేర్కొన్నారు.



You may be interested

డిసెంబర్‌లో మార్కెట్‌పై పట్టు ఎవరిది..?

Tuesday 4th December 2018

ముంబై: గతనెలలో ప్రధాన సూచీలు 5 శాతానికి మించి లాభాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 36,000 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 11,000 మార్కుకు సమీపించింది. ఇక నెలలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉంటుందనే అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా డిసెంబర్‌ నెలలో మార్కెట్‌ బుల్స్‌ పట్టులోనే ఉంటుందనేది గడిచిన 10 ఏళ్లలో మార్కెట్‌ నడిచిన తీరును చూస్తుంటే అర్థమవుతోందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. 2008 నుంచి గడిచిన

సెప్టెంబర్‌లో త్రైమాసికంలో కట్టలు తప్పనున్న క్యాడ్‌

Tuesday 4th December 2018

3 శాతానికి చేరుతుందని అంచనా న్యూఢిల్లీ: కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) మూడవ త్రైమాసికంలో కట్టుతప్పే అవకాశం ఉందని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ- ఇక్రా తన తాజా నివేదికలో అంచనా వేసింది. జూలై- సెప్టెంబర్‌ కాలంలో వచ్చిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో క్యాడ్‌ 3 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ నెలలో క్యాడ్‌ 2.4 శాతంగా నమోదయ్యింది. మూడవ త్రైమాసికంలో అధికంగా ఉన్న క్రూడ్‌ ధరలు,

Most from this category