STOCKS

News


భారత్‌లో గోజీరో మోబిలిటీ బైక్‌లు

Wednesday 20th March 2019
news_main1553061671.png-24709

వచ్చే వారం వన్‌, మైల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లు 
-లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు కూడా 

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే వారం రెండు ఎలక్ట్రిక్‌ బైక్‌లు... వన్‌, మైల్‌లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గోజీరో వన్‌ బైక్‌లో 400 వాట్‌అవర్‌(డబ్ల్యూహెచ్‌) లిథియమ్‌ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్‌ కుమార్‌ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే, 60 కీమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గోజీరో మైల్‌ బైక్‌ను 300 వాట్‌అవర్‌ లిథియమ్‌ బ్యాటరీతో రూపొందించామని, ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 45 కిమీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రెండు బైక్‌లతో జాకెట్లు, బెల్ట్‌లు, వాలెట్స్‌ వంటి లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

కీర్తి సోలార్‌తో ఒప్పందం 
ప్రస్తుత ఉత్పత్తుల అభివృద్ధికి, భవిష్యత్తు ఉత్పత్తుల కోసం కోల్‌కతాకు చెందిన కీర్తి సోలార్‌ కంపెనీతో గోజీరో మోబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే తమ కంపెనీలో కీర్తి సోలార్‌ కంపెనీ 2,50,000 డాలర్లు పెట్టుబడులు పెట్టిందని గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్‌ కుమార్‌ తెలిపారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే మంచి పనితీరు కనబరిచే ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తయారీ, పంపిణీ రంగాల్లో తమ కంపెనీకి అపార నైపుణ్యం ఉందని తెలిపారు. వివిధ వినియోగదారుల సెగ్మెంట్లకు అవసరమైన ఉత్పత్తుల కోసం కీర్తి సోలార్‌ కంపెనీతో కలిసి పనిచేస్తామని వివరించారు. 



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Wednesday 20th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం సల్పంగా తగ్గుముఖం పె‍ట్టంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల మేర నష్టపోయి 1,303.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ రివకరీ, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ పసిడి పతనానికి కారణమైంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1,306.30 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో ఆసియా ఈక్విటీ

వ్యాపార అవకాశాల విస్తృతికి ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

Wednesday 20th March 2019

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతికి పరస్పర సహకారం లక్ష్యంగా భారత్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), చైనా బ్యాంకింగ్‌ దిగ్గజం, మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌-  బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (బీఓసీ) లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఒక అవగహనా పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విస్తృతికి రెండు

Most from this category