STOCKS

News


ప్రభుత్వం చేతికి స్విస్‌ ఖాతాదారుల వివరాలు

Thursday 11th July 2019
news_main1562824967.png-26977

  • సెప్టెంబర్ నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ/ బెర్న్: నల్లధనంపై కేంద్రం ప్రకటించిన పోరు క్రమంగా ఫలితాలనిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులందరి ఆర్థిక లావాదేవీల వివరాలు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం చేతికి రానున్నాయి. గత ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు కూడా లభించనున్నాయి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) విధానం కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందజేయనున్నట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (ఎఫ్‌డీఎఫ్‌) వెల్లడించింది. అటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ కూడా ఈ విషయాలు లోక్‌సభకు తెలిపారు. తొలి సెట్‌ సెప్టెంబర్‌లో లభిస్తుందని, ఆ తర్వాత నుంచి వార్షిక ప్రాతిపదికన స్విస్‌ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల వివరాలు ప్రభుత్వం చేతికి వస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని భారత్‌కు స్విట్జర్లాండ్ అందిస్తోంది. తాజా వివరాలు దీనికి అదనంగా ఉంటాయి. ఏఈవోఐ కింద తమ ఖాతాదారుల వివరాలను బ్యాంకులు స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆయా ఖాతాదారుల దేశాల పన్ను శాఖ అధికారులకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆటోమేటిక్‌గా చేరవేస్తుంది. ఇందులో ఖాతాదారు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు మొదలైన వివరాలు ఉంటాయి. 



You may be interested

జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు

Thursday 11th July 2019

ఐదేళ్లలో రికార్డు న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్‌ధన్‌ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌ 6 నాటికి ఈ

పాలు, నిత్యావసరాలు @ స్విగ్గీ

Thursday 11th July 2019

డెలివరీ సేవల కోసం రూ.680 కోట్ల పెట్టుబడి 'సూపర్‌' సబ్‌స్క్రిప్షన్స్‌ను పెంచుకోవడంపై దృష్టి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే యోచన న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలందించే స్విగ్గీ తాజాగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. గతేడాది కొనుగోలు చేసిన పాలు, నిత్యావసరాల డెలివరీ సంస్థ 'సూపర్‌'పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగంపై దాదాపు రూ.680 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ స్టోర్స్‌ పేరిట హైపర్‌ లోకల్‌ డెలివరీ

Most from this category