STOCKS

News


15 రోజుల్లోపు ఎయిర్‌ ఇండియా పునరుద్ధరణ ప్యాకేజీ: చౌబే

Friday 5th October 2018
news_main1538714021.png-20880

న్యూఢిల్లీ: ఎయిర్‌ఇండియా పునరుద్ధరణ ప్యాకేజీని 10-15 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబే తెలిపారు. రూ.50,000 కోట్లకు పైగా రుణ భారంతో, తీవ్ర నష్టాల మధ్య నడుస్తున్న ఎయిర్‌ఇండియాలో వాటాలను అమ్మేయాలని ప్రభుత్వం లోగడ ప్రయత్నించినప్పటికీ కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ సంస్థను ఒడ్డున పడేసే బాధ్యత ప్రభుత్వంపైనే పడింది. అధిక చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత రూపంలో విమానయాన రంగంలో భిన్నమైన పరిస్థితి నెలకొందని చౌబే పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్రగార్గ్‌తో భేటీ అనంతరం చౌబే మీడియాతో మాట్లాడారు. ప్రధానేతర ఆస్తుల విక్రయం సహా పలు మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అయితే అంతకుముందు మీడియాతో మాట్లాడిన సందర్భంలో చౌబే... ఎయిర్‌లైన్‌ సంస్థలు పెరిగిన వ్యయాలను సర్దుబాటు చేసుకుంటున్నాయని, ఎంత కాలం పాటు ఇలా చేస్తాయి, ఎప్పుడు టికెట్‌ ధరలను పెంచుతాయన్నది వ్యాపారపరమైన నిర్ణయంగా పేర్కొన్నారు. 



You may be interested

ఆర్సెలర్‌ మిట్టల్‌, న్యుమెటల్‌కు మరో అవకాశం

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు బిడ్‌ వేసుకునేందుకు ఆర్సెలర్‌ మిట్టల్‌, రష్యాకు చెందిన వీటీబీ బ్యాంకు ఆధ్వర్యంలోని న్యుమెటల్‌కు సుప్రీంకోర్టు మరో అవకాశం కల్పించింది. రూ.45,000 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైన ఎస్సార్‌ స్టీల్‌ పునరుద్ధరణ ప్రణాళికను దాఖలు చేసేందుకు మాత్రం అనుమతి లేదని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రెండు వారాల్లోగా మీ కంపెనీల తాలూకు ఎన్‌పీఏలను చెల్లించేయండి. అలా

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభ ప్రభావం పెద్దగా పడదు

Friday 5th October 2018

నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్న జైట్లీ న్యూఢిల్లీ: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థలో సంక్షోభాన్ని మొదట్లోనే నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కనుక ఇదేమంత తీవ్ర ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. రూ.91,000 కోట్ల రుణాలను తీసుకుని, ఇటీవల పలు చెల్లింపుల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ విఫలం కావడంతో, బోర్డును ప్రభుత్వం సస్పెండ్‌ చేసి తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో సంక్షోభం మార్కెట్లలో నిధుల సమస్యకు దారితీస్తుందన్న

Most from this category