STOCKS

News


ఫేమ్ పథకం అమలుకు ప్రత్యేక కమిటీ

Tuesday 19th March 2019
news_main1552977848.png-24685

- భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటు
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్‌-2 పథకం అమలును పర్యవేక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా అంతర్‌-మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో, పారిశ్రామిక ప్రోత్సాహం.. అంతర్గత వాణిజ్య వ్యవహారాల విభాగం కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శితో పాటు విద్యుత్‌.. పునరుత్పాదక ఇంధనాల శాఖ కార్యదర్శి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఏ వాహనానికి గరిష్టంగా ఎంత మేర ప్రోత్సాహకం ఇవ్వాలి, వివిధ విభాగాలకు నిధుల కేటాయింపులు ఎలా ఉండాలి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సుమారు రూ. 10,000 కోట్లతో ప్రకటించిన ఫేమ్‌ ఇండియా రెండో విడత కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ల పాటు అమలవుతుంది. ఈ స్కీము కింద 2019-20లో రూ. 1,500 కోట్లు, 2020-21లో రూ. 5,000 కోట్లు, 2021-22లో 3,500 కోట్లు వ్యయం చేయనున్నారు. విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్, హైబ్రీడ్‌ కార్లు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, విద్యుత్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు దీనికింద ప్రోత్సాహకం లభిస్తుంది. 
ఈ స్కీము ప్రకారం 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు దాదాపు రూ. 20,000 దాకా సబ్సిడీ లభిస్తుంది. అలాగే రూ. 5 లక్షల దాకా ధర ఉండే (ఎక్స్‌-ఫ్యాక్టరీ రేటు) 5 లక్షల ఎలక్ట్రిక్ రిక్షాలకు దాదాపు రూ. 50,000 దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 15 లక్షల దాకా ఖరీదు చేసే 35,000 పైచిలుకు విద్యుత్ కార్లకు రూ. 1.5 లక్షల దాకా ప్రోత్సాహకం ఉంటుంది. రూ. 2 కోట్ల దాకా ఖరీదు చేసే 7,090 ఎలక్ట్రిక్ బస్సులకు రూ. 50 లక్షల దాకా ప్రోత్సహకం లభిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 2,700 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ఈ పథకం కింద తోడ్పాటు లభించనుంది. 



You may be interested

మైండ్‌ట్రీపై మైండ్‌గేమ్‌!!

Tuesday 19th March 2019

– పట్టు కోసం వ్యవస్థాపకుల యత్నాలు – టేకోవర్‌ కోసం ఎల్‌అండ్‌టీ వ్యూహాలు – ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటన – 1 బిలియన్‌ డాలర్లపైగా వ్యయం      ఐటీ సంస్థ మైండ్‌ట్రీ కోసం ఇటు వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు ఇటు వ్యవస్థాపకులు ప్రయత్నిస్తుండగా..  టేకోవర్‌ చేసేందుకు అటు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో కంపెనీ చేజారిపోకుండా కాపాడుకునేందుకు

నెల రోజులకోసం టాప్‌ సిఫార్సులు

Tuesday 19th March 2019

వచ్చే నెల రోజుల్లో దాదాపు 13 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది. మిడ్‌టర్మ్‌లో నిఫ్టీ 12400 పాయింట్లను చేరవచ్చని అంచనా వేసింది.  1. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 96. స్టాప్‌లాస్‌ రూ. 81. బుల్లిష్‌ సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి రెండు వారాల క్రితం పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. దీంతో షేరులో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని నిర్ధారణ వచ్చింది. గత ఐదు సెషన్లుగా స్టాకు

Most from this category