STOCKS

News


కోల్‌ ఇండియా ఓఎఫ్‌ఎస్‌ ఓకే

Friday 2nd November 2018
Markets_main1541139806.png-21653

  • 3.18 శాతం వాటా విక్రయం
  • రూ.5,300 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: కోల్‌ ఇండియా వాటా విక్రయం విజయవంతంగా ముగిసింది. ఈ కంపెనీలో 3 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. బుధవారం ప్రారంభమైన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) గురువారం ముగిసింది. ఈ ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 3.18 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి రూ.5,300 కోట్లు సమీకరించింది. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్‌ ఇన్వెస్టర్లకు బిడ్‌ చేయడానికి కేటాయించారు. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో భాగంగా 3 శాతం వాటాకు సమానమైన 18.62 కోట్ల షేర్లను ప్రభుత్వం ఆఫర్‌  చేసింది. ఒక్కో షేర్‌ ఫ్లోర్‌ ధరను రూ.266గా నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈ ధరపై 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.
1.56 రెట్లు సబ్‌స్క్రైబయిన రిటైల్‌ వాటా..
రిటైల్‌ ఇన్వెస్టర్లకు 3.96 కోట్ల షేర్లను రిజర్వ్‌ చేశారు. 6.19 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ వాటా విభాగం 1.56 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా కూడా 1 శాతానికి పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. వారికి 14.89 కోట్ల షేర్లను కేటాయించగా, 15.84 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. ఈ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రైబయితే అదనంగా మరో 6 శాతం వాటాను (37.24 కోట్లు) విక్రయించాలని ప్రభుత్వం భావించింది. 3 శాతం వాటా విక్రయానికి గాను 3.18 శాతం వాటా షేర్ల కోసం బిడ్‌లు వచ్చాయని, అదనంగా వచ్చిన 0.18 శాతం వాటా బిడ్‌లను కూడా ఆమోదిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 2015, జవనరిలో ఓఎఫ్‌ఎస్‌ ద్వారానే 10 శాతం వాటా విక్రయించి ప్రభుత్వం రూ.23,000 కోట్లు సమీకరించింది.
ప్రస్తుతం కోల్‌ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 78.32 శాతం వాటా ఉంది. ఓఎఫ్‌ఎస్‌ నేపథ్యంలో బీఎస్‌ఈలో కోల్‌ ఇండియా షేర్‌ 1.9 శాతం నష్టపోయి రూ.261 వద్ద ముగిసింది.
అతి పెద్ద వాటా విక్రయం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద వాటా విక్రయం ఇదే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ రూ.10,028 కోట్లు సమీకరించింది. భారత్‌-22 ఈటీఎఫ్‌ ఫాలో ఆన్‌ ఆఫర్‌తో పాటు రీట్స్‌, ఇర్కన్‌, మిధాని, గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వం రాబట్టింది.



You may be interested

అటోకు కలిసిరాని​ అక్టోబర్‌

Friday 2nd November 2018

పండుగ సీజన్లో అంతంతమాత్రం అమ్మకాలు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన వృద్ధి వడ్డీ రేట్లు, అధిక ఇంధన రేట్ల ప్రభావం న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు, ఇంధన రేట్ల పెరుగుదల తదితర అంశాల కారణంగా పండుగ సీజన్ అయినప్పటికీ వాహన తయారీ సంస్థలకు అక్టోబర్ అంతగా కలిసి రాలేదు. అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా, టయోటా, హోండా కార్స్‌ వంటి దిగ్గజ సంస్థల వాహన అమ్మకాల వృద్ధి కూడా 1- 2 శాతంగా

పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ

Friday 2nd November 2018

లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం పసిడి ధర నష్టాల్లో బాట పట్టింది. అమెరికా మార్కెట్లో గురువారం రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 16నెలల గరిష్టస్థాయి నుంచి దిగిరావడంతో అక్కడ ఔన్స్‌ పసిడి 23డాలర్లు లాభపడి 1238.60డాలర్ల వద్ద ముగిసింది. అమెరికాలో నవంబర్‌ 06న జరిగే మధ్యంతర ఎన్నికల్లో ప్రస్తుత పాలక పక్షమైన రిపబ్లిక్‌ పార్టీపై ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్‌ విజయం సాధిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు

Most from this category