STOCKS

News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఐదేళ్ల ఖాతాలను తనిఖీ చేస్తాం

Saturday 22nd December 2018
news_main1545450268.png-23150

ముంబై: ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు, దాని సబ్సిడరీ కంపెనీలకు సంబంధించి గత ఐదేళ్ల ఖాతా పుస్తకాలను కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 130 కింద తిరిగి తనిఖీ చేసేందుకు అనుమతించాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఓ కంపెనీ ఖాతా పుస్తకాలను తిరిగి తెరిచేందుకు అనుమతి కోరడం 2013 నాటి కంపెనీల చట్టం కింద ఇదే మొదటి సారి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు  రూ.90,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రూపు పరిధిలో అవినీతి, వ్యక్తిగత లబ్ధి, ఇతర అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఎస్‌ఎఫ్‌ఐవో ప్రాథమిక దర్యాప్తులో బయటపడడంతో గ్రూపుతోపాటు దాని అనుబంధ కంపెనీలైన ఐటీఎన్‌ఎల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గత సంవత్సరాల బ్యాలన్స్‌ షీట్లను కేంద్రం పరిశీలించాలని నిర్ణయించింది. అయితే, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పిటిషన్‌పై ఎన్‌ఎస్‌ఎల్‌టీ తక్షణమే ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆర్‌బీఐ, సెబీ, ఆదాయపన్ను శాఖల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉందంటూ జనవరి 1కి వాయిదా వేసింది. You may be interested

ఈ-కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ-కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2-3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల

కొత్త టెక్నాలజీలతో బోలెడన్ని అవకాశాలు

Saturday 22nd December 2018

సాక్షి, హైదరాబాద్‌: మున్ముందు అన్ని రంగాల్లోనూ ఏఐ, ఐఓటీ వంటి డీప్‌ టెక్నాలజీస్‌ పాత్ర కీలకం కానుందని.. దీనికి ఆందోళన చెందకుండా అవకాశంగా మలచుకోవాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ – కోల్‌కత బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌ శ్రీకృష్ణ కులకర్ణి సూచించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం మొదలు ఐటీ వరకూ అన్నిటా ఏఐ, ఐఓటీల ప్రమేయంతో కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి వస్తుందని, దీనికి సంస్థల యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

Most from this category