STOCKS

News


మార్చి నాటికి ఏఐఏటీఎస్‌ఎల్‌ అమ్మకం

Monday 26th November 2018
news_main1543213035.png-22380

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా అనుబంధ కంపెనీ ఏఐఏటీఎస్‌ఎల్‌ విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి (వచ్చే ఏడాది మార్చి కల్లా) పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విక్రయ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి త్వరలోనే మర్చంట్ బ్యాంకర్స్‌ నుంచి బిడ్లను ఆహ్వానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ దీనికి మంచి స్పందన వచ్చిన పక్షంలో.. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో కొంతైనా సాధించేందుకు తోడ్పడగలదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్న కేంద్రం.. ఇప్పటిదాకా రూ. 15,200 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది.
    దాదాపు రూ. 50,000 కోట్ల భారంతో కుంగుతున్న ఎయిరిండియాలో వాటాలను విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నించినప్పటికీ పరిశ్రమ నుంచి స్పందన కరువవడంతో వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీని పునర్‌వ్యవస్థీకరించడంపై దృష్టి పెట్టిన కేంద్రం.. మిగతా అనుబంధ సంస్థల్లో వ్యూహాత్మక ప్రాతిపదికన వాటాలను విక్రయించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐఏటీఎస్‌ఎల్‌ను విక్రయించడంపై కసరత్తు చేస్తోంది. 2016-17 డేటా ప్రకారం ఎయిరిండియాకు చెందిన రెండు అనుబంధ సంస్థలు ఏఐఏటీఎస్‌ఎల్‌ రూ. 62 కోట్లు , ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ రూ. 297 కోట్లు లాభాలు నమోదు చేశాయి.



You may be interested

దివాలా చట్టంతో మంచి ఫలితాలు

Monday 26th November 2018

రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారం కార్పొరేట్‌ శాఖ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్‌ న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారానికి అవకాశం ఏర్పడినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఐబీసీ 2016 డిసెంబర్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాగా, ఇప్పటి వరకు 9,000 ఎన్‌పీఏ కేసులు ఈ చట్టం కింద పరిష్కారం కోసం వచ్చినట్టు

కెయిర్న్​ ఎనర్జీ షేర్లు విక్రయించిన ఐటీ శాఖ

Monday 26th November 2018

న్యూఢిల్లీ: సుమారు రూ. 10,247 కోట్ల పన్ను బకాయీలను రాబట్టుకునే క్రమంలో కెయిర్న్ ఎనర్జీ షేర్లను ఆదాయ పన్ను శాఖ విక్రయించేసినట్లు తెలుస్తోంది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌ (పాత లావాదేవీలకు కూడా వర్తింపచేసే పన్ను) విధించడంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు ప్రకటించేందుకు మరికొన్ని రోజులు ఉందనగా ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కెయిర్న్ ఎనర్జీకి ఉన్న వాటాలను కొనుగోలు చేయడం ద్వారా కెయిర్న్ ఇండియాని వేదాంత విలీనం చేసుకున్న

Most from this category