STOCKS

News


దివాల కేసుల పరిష్కారానికి 8 ప్రత్యేక కోర్టులు

Friday 28th September 2018
news_main1538109154.png-20659

న్యూఢిల్లీ: దివాలా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి సత్వర పరిష్కారానికి గాను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలో 8 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. దేశవ్యాప్తంగా ఎన్‌సీఎల్‌టీకి 11 బెంచ్‌లు ఉన్నప్పటికీ కేసుల భారం పెరిగిపోవడంతో, దీన్ని తగ్గించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. మొండి బకాయిల పరిష్కారానికి గాను కేంద్ర సర్కారు ఇటీవల తీసుకొచ్చిన ఐబీసీ చట్టం కింద కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం గమనార్హం. కంపెనీల కొనుగోళ్లు, విలీనాలతోపాటు దివాలా, బ్యాంక్రప్టసీ కేసులను ఎన్‌సీఎల్‌టీ చూస్తుంది. ఈ ఏడాది జనవరి నాటికి అన్ని రకాల కేసులు కలిపి 9,073 పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క ఐబీసీ చట్టం కిందే జూన్‌ చివరి నాటికి 6,326 కంపెనీలు కేసులు దాఖలు చేశాయి. 



You may be interested

ఎంఎస్‌ఎంఈలకు ఇన్‌స్టామోజో రుణాలు

Friday 28th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ఇన్‌స్టామోజో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు తక్షణ రుణాలను అందజేసేందుకు మోజో క్యాపిటల్‌ సేవలను ప్రారంభించింది. కంపెనీ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌స్టామోజో కో-ఫౌండర్‌ ఆకాశ్‌ గెహానీ  గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘24 గంటల్లో కస్టమర్‌ ఎప్పుడు కోరినా క్షణాల్లో లోన్‌ వారి ఖాతాలో చేరుతుంది. వడ్డీ

మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’

Friday 28th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ మేక్‌ మై ట్రిప్‌ ‘షార్ట్‌ స్టేస్‌’ పేరుతో దేశంలో తొలిసారిగా వినూత్న విధానాన్ని అక్టోబరులో పరిచయం చేయబోతోంది. సాధారణంగా ఏ హోటల్‌కు వెళ్లినా గది చార్జీ 24 గంటలుగా లెక్కకడతారు. షార్ట్‌ స్టేస్‌ విధానంలో 4 గంటల వ్యవధికి కూడా గది అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని తిరుపతిలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నట్టు మేక్‌ మై ట్రిప్‌ ఇండియా

Most from this category