STOCKS

News


పంచదార మిల్లులకు అదనంగా రూ.7,400 కోట్లు?

Monday 24th December 2018
news_main1545625451.png-23189

న్యూఢిల్లీ: దేశంలో ఇథనాల్‌ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.7,400 కోట్ల మేర సులభ రుణాలు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొలాసెస్‌ ఆధారితం కాని డిస్టిలరీలకు సైతం రుణాలు ఇవ్వాలన్నది కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదన. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ పథకంలో భాగంగా చక్కెర మిల్లులకు ఐదేళ్ల కాలంలో రూ.4,400 కోట్ల సులభ రుణాలను, రూ.1,332 కోట్ల వడ్డీ రాయితీతో అందించాలని నిర్ణయించింది. అయితే, రూ.13,400 కోట్ల రుణాలను ఆశిస్తూ మొత్తం మీద 280 దరఖాస్తులు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటిల్లో 114 దరఖాస్తులకు సంబంధించి రూ.6,000 కోట్ల రుణాలను ఆమోదించినట్టు వెల్లడించాయి. మిగిలిన 168 దరఖాస్తులకు సంబంధించి కూడా రూ.7,400 కోట్ల రుణాలను వడ్డీ రాయితీపై ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోరాలని ఆహార మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు తెలిపాయి. 



You may be interested

బలపడిన పసిడి

Monday 24th December 2018

అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు సోమవారం పసిడి ధరను పరుగులు పెట్టిస్తున్నాయి. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లోనే ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు లాభపడింది. గతవారంలో మార్కెట్లకు చివరి రోజైన శుక్రవారం అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లు కిస్మస్‌(మంగళవారం) వరకు పడటంతో శుక్రవారం అర్థరాత్రి నుంచి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌

ప్రపంచ పరిణామాలు కీలకం..!

Monday 24th December 2018

న్యూఢిల్లీ: అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్‌) వడ్డీ రేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ షట్‌డౌన్‌ వంటి ప్రతికూల పరిణామాలు గతవారంలో అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ గతవారంలో 1,655 పాయింట్లు (6.8 శాతం) పతనంకాగా, నాస్‌డాక్‌ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు సైతం భారీ పతనాన్ని నమోదుచేశాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 10,754 వద్ద ముగిసింది.

Most from this category