STOCKS

News


రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం !

Saturday 20th April 2019
news_main1555738311.png-25239

-శతృ ఆస్తుల విక్రయానికి కూడా 
-కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సం‍స్థల స్థలాల విక్రయానికి రీట్స్‌ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృఆస్తుల విక్రయానికి కూడా రీట్స్‌(రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది. 

రీట్స్‌ విధానంపై ఆర్థిక శాఖ చూపు...
వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ ఆస్తులను పూర్తిగా అమ్మేయడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ, లేదా రీట్స్‌ విధానాన్ని గానీ చేపట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అలాగే శతృ స్థిరాస్తుల విక్రయానికి కూడా రీట్స్‌ను పరిశీలించాలని సదరు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్‌, లేదా చైనా దేశాలకు వలస వెళ్లి భారత పౌరసత్వం కోల్పోయిన పౌరుల ఆస్తులను శతృ ఆస్తులుగా పరిగణిస్తారు. శతృ ఆస్తులకు కస్టోడియన్‌గా హోమ్‌ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తుంది. 
2014లోనే రీట్స్‌ నిబంధనలు...
రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను సెబీ 2014లోనే రూపొందించినా, ఇవి ఇంకా ప్రాచుర్యం పుంజుకోలేదు. ఇటీవలనే  ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌, అమెరికాకు చెందిన ప్రముఖ పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌లు సంయుక్తంగా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. రూ.300 ఇష్యూ ధరతో ఇటీవలనే ఐపీఓకు వచ్చిన ఈ సంస్ట్‌ రీట్‌ ఇప్పుడు రూ.337 ధర వద్ద ట్రేడవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా రీట్స్‌ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. రీట్స్‌ విధానంలో స్థలాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రీట్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. 



You may be interested

భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి

Saturday 20th April 2019

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వెల్లడి న్యూఢిల్లీ: షార్ట్‌ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించినప్పటికీ భారత్‌లో వచ్చే మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఆఖరుకి భారత్‌లోని ఉద్యోగుల సంఖ్యను కూడా 1,000కి పెంచుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నట్లు బైట్‌డ్యాన్స్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ విభాగం) హెలినా లెర్ష్‌ వెల్లడించారు. స్వల్ప నిడివి ఉండే

అమెజాన్‌, గూగుల్ దోస్తీ

Saturday 20th April 2019

ఫైర్‌టీవీలో యూట్యూబ్‌ క్రోమ్‌క్యాస్ట్‌లో ప్రైమ్ వీడియోలు న్యూఢిల్లీ:  టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. దీంతో గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇకపై అమెజాన్‌ ఫైర్‌ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను గూగుల్‌ క్రోమ్‌క్యాస్ట్‌ యూజర్లు కూడా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్‌

Most from this category