STOCKS

News


పార్లమెంట్‌ ముందుకు కంపెనీల చట్ట సవరణ బిల్లు

Friday 21st December 2018
news_main1545368706.png-23124

న్యూఢిల్లీ: కంపెనీ యాక్ట్‌ను సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వ్యాపారనుకూల వాతావరణం మెరుగుపరచేందుకు వీలుగా కంపెనీల చట్టాన్ని సవరించనున్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే గత నవంబర్‌లో జారీ చేసిన కంపెనీల సవరణ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లుతుంది. కొత్త సవరణలతో ప్రత్యేక కోర్టులపై అదనపు భారం తగ్గనుంది. తాజా సవరణల ప్రకారం 16 రకాల కార్పొరేట్‌ నేరాల విచారణ అధికారం ప్రత్యేక కోర్టుల నుంచి ఇన్‌-హౌస్‌ ఎడ్జుడికేషన్‌కు (సాక్ష్యాలు, వాదనలు ప్రత్యేకంగా సమీక్షించే యంత్రాంగం) బదిలీ అవుతాయి. వివాదంలో ఒక విస్పష్టమైన తుది నిర్ణయానికి రావడానికి ఈ యంత్రాగం దోహదపడడమే కాకుండా, ప్రత్యేక కోర్టులపై దాదాపు 60 శాతం భారం దిగివస్తుందని అంచనా. అందువల్ల ఇకపై ప్రత్యేక కోర్టులు తీవ్రమైన ఆర్థిక నేరాలపై ఎక్కువ శ్రద్ధ వహించే వీలు చిక్కుతుంది. ఇందుకోసం పాత చట్టంలోని 16 సెక‌్షన్స్‌ను సవరిస్తున్నారు. సవరణ అనంతరం ఇన్‌-హౌస్‌ ఎడ్జుడికేషన్‌ విభాగాలు 18 నుంచి 34కు పెరుగుతాయి. దీంతోపాటు చిన్న కంపెనీలకు అనువైన జరిమానాలు విధించాలని సవరణలో పొందుపరిచారు. రీజినల్‌ డైరెక్టర్ల పరిధి పెంపు, కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆర్థిక సంవత్సరం పాటించేందుకు అనుమతినిచ్చే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉండడం వంటివి తాజా సవరణల్లో ఉన్నాయి. ఈ సవరణలను ప్రభుత్వం నియమించిన ప్యానెల్‌ సిఫార్సు చేసింది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమ్‌ ఫిట్‌ కార్ల రుణాలు

Friday 21st December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బ్యాంకింగ్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల కార్ల రుణ పథకాలను ప్రకటించింది. బెలూన్‌ ఈఎంఐ, స్టెప్‌ అప్‌ స్కీమ్‌ పేరుతో వీటిని ప్రవేశపెట్టింది. బెలూన్‌ ఈఎంఈ విధానంలో.. ఉదాహరణకు కస్టమర్‌ రూ.10 లక్షల రుణం 24 నెలల కాలానికి తీసుకుని ఉంటే.. 70 శాతం రుణాన్ని (రూ.7 లక్షలు) మొదటి 23 నెలల్లో తీర్చాలి. మిగిలిన రూ.3 లక్షలను

బీమా జేవీలో బీఓఐ వాటా విక్రయం!

Friday 21st December 2018

ముంబై: బీమా రంగ జాయింట్‌ వెంచర్‌లో తన వాటాను విక్రయించి రూ. 1000 నుంచి రూ.1200 కోట్లు సమీకరించాలని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తున్నట్లు తెలిసింది. 2009లో దైచీ బీమా కంపెనీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక బీమా రంగ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. స్టార్‌ యూనియన్‌ దైచీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరిట ఏర్పాటైన ఈ జేవీలో దైచీకి 45.94 శాతం,

Most from this category