News


2019లోనూ కేంద్రానికి భారీగా నిధులు

Wednesday 2nd January 2019
news_main1546410479.png-23362

  • ఎయిర్‌ ఇండియా వాటాల అమ్మకమే తరువాయి
  • 2018లో ప్రభుత్వ కంపెనీల్లో వాటాల అమ్మకంతో రూ.77,417 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా రూ.77,417 కోట్లను సమీకరించింది. ఇక 2019లోనూ ఎయిర్‌ ఇండియాలో వాటాలను ఎలాగైనా విక్రయించాలన్న లక్ష్యంతో ఉంది. దీంతో ఈ ఏడాది కూడా కేంద్రానికి గణనీయంగానే నిధులు సమకూరనున్నాయి. గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీల మధ్య విలీనాల ద్వారా తన నిధుల అవసరాలను తీర్చుకునే ప్రణాళికలను అమలు చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఓఎన్‌జీసీ ఇదే విధంగా హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసింది. దీంతో హెచ్‌పీసీఎల్‌లో కేంద్రం తనకున్న వాటాను ఓఎన్‌జీసీకి విక్రయించడం ద్వారా గణనీయంగానే నిధులు సమకూరాయి. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, భారత్‌ 22ఈటీఎఫ్‌, కోల్‌ ఇండియాలో వాటాల అమ్మకం, ఆరు ప్రభుత్వరంగ సంస్థల ఐపీవోల ద్వారా కేంద్రానికి గత సంవత్సరంలో 77,417 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి.
2019 అమ్మకాలు...
ఎయిర్‌ ఇండియాలో వాటాలను కేంద్రం గతేడాది అమ్మకానికి పెట్టినప్పటికీ... ఏ ప్రైవేటు సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎయిర్‌ఇండియాకు రూ.55వేల కోట్ల వరకూ రుణాలు ఉండడంతోపాటు కార్యకలాపాలపై పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్న విషయం గమనార్హం. దీంతో ఎయిర్‌ ఇండియా అమ్మకానికి ముందు ఆ సంస్థను గాడిలో పెట్టే చర్యలను కేంద్రం అమల్లో పెట్టింది. తన ప్రణాళికలో భాగంగా ఎయిర్‌ ఇండియా సబ్సిడరీలు ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌, ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌, భవనాలు, ఖాళీ స్థలాలను విక్రయించనుంది. దీని ద్వారా రూ.29,000 కోట్ల వరకు రుణ భారం తగ్గించనుంది. మరోవైపు ఎయిర్‌ ఇండియా లాభాల్లోకి వచ్చేందుకు గాను నిధుల సాయం కూడా చేయనుంది. తద్వారా ఎయిర్‌ఇండియా కొనుగోలును లాభసాటిగా మార్చాలన్నది కేంద్రం వ్యూహం. ఇక 2019లో పవన్‌ హన్స్‌లో తనకున్న 51 శాతం వాటాను కేంద్రం విక్రయించనుంది. మిగిలిన 49 శాతం వాటా ఓఎన్‌జీసీకి ఉంది. మార్చి నాటికి దీని విక్రయం పూర్తవుతుందని అంచనా. ఇక ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్‌, ఆయిల్‌ ఇండియా, ఎన్‌ఎల్‌సీ, బీహెచ్‌ఈఎల్‌  తదితర కంపెనీల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా కేంద్రానికి రూ.12,000 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఆర్‌ఈసీలో కేంద్రం వాటాలను పీఎఫ్‌సీ కొనుగోలు చేయడం ద్వారా మరో రూ.15,000 కోట్లు సమకూరతాయి. ఎస్‌జేవీఎన్‌లో కేంద్రం వాటాను ఎన్‌టీపీసీ కొనడం ద్వారా రూ.6,000 కోట్లు రానున్నాయి.



You may be interested

కర్ణాటక బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు

Wednesday 2nd January 2019

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కర్ణాటక బ్యాంక్‌ తాజాగా మార్జినల్ కాస్ట్‌ ఆఫ్ ఫండ్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 0.15 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 9.10 శాతానికి చేరినట్లవుతుందని, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. ఇక ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 0.10 శాతం పెరిగి 8.75 శాతానికి, మూడు నెలలది 0.10 శాతం మేర పెరిగి 8.70 శాతానికి

పెట్రోల్‌, డీజిల్‌ కంటే విమాన ఇంధనమే చౌక!

Wednesday 2nd January 2019

భారీగా తగ్గిన రేట్లు న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరను కిలోలీటర్‌కు రూ.9,990 (14.7 శాతం) తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.58,060కు దిగొచ్చింది. అంటే లీటర్‌ ధర రూ.58.06. ఢిల్లీ మార్కెట్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.68.65తో పోలిస్తే తక్కువకు అందుబాటులోకి వచ్చింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ.62.66 కంటే కూడా చౌకగా మారింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు ఇది పెద్ద

Most from this category