STOCKS

News


జోరుగా డిజిన్వెస్ట్‌మెంట్‌

Saturday 8th September 2018
news_main1536381384.png-20083

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్‌) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో (సీఈఎల్‌) పూర్తిగా 100 శాతం వాటాలను విక్రయించేందుకు శుక్రవారం బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు బిడ్డర్లు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) పంపాలంటూ ప్రకటించింది. ఈవోఐలు దాఖలు చేసేందుకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ. 2018 మార్చి 31 నాటికి కనీసం రూ. 50 కోట్ల నికర విలువ గల సంస్థలు బిడ్లను దాఖలు చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. 1974లో ఏర్పాటైన సీఈఎల్‌ ప్రస్తుతం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహణలో ఉంది. 2017 మార్చి ఆఖరు నాటి లెక్కల ప్రకారం దీని నికర విలువ రూ.50.34 కోట్లు. గతేడాదే ఈ సంస్థ విక్రయ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇప్పటిదాకా భారత్‌-22 ఈటీఎఫ్‌, రైట్స్‌ సంస్థలో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ. 9,000 కోట్లు సమీకరించింది. 
రూ. 467 కోట్ల ఇర్కాన్ ఐపీవో..
రైల్వేస్‌ అనుబంధ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్‌లో 10 శాతం వాటాల విక్రయంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా రూ. 467 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) సంబంధించి ధర శ్రేణిని రూ. 470- రూ. 475గా ఇర్కాన్‌ నిర్ణయించింది. ఈ ఐపీవోలో కేంద్రం 99,05,157 షేర్లను విక్రయిస్తోంది. సెప్టెంబర్‌ 17న ప్రారంభమయ్యే ఐపీవో 19న ముగుస్తుంది. షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేస్తారు. 1976లో ప్రారంభమైన ఇర్కాన్‌..  రైల్వేస్‌, హైవేలు, వంతెనలు మొదలైన మౌలిక రంగ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. సంస్థకు రూ. 22,406 కోట్ల మేర ఆర్డర్లున్నాయి.  ఈ ఏడాది జూన్‌లోనే రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్‌ కూడా ఐపీవోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
ఏఐఏటీఎస్‌ఎల్‌లో వాటాల అమ్మకం ..
రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను గట్టెక్కించే ప్రణాళికల్లో భాగంగా దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఏఐఏటీఎస్‌ఎల్‌)లో వ్యూహాత్మక వాటాల విక్రయ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. మంత్రుల బృందం (జీవోఎ౾) అనుమతులు వచ్చిన తర్వాత బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల నిర్వహణ, రిపేరింగ్‌, సర్వీసింగ్, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్ వంటి సేవలు అందించే.. ఏఐఏటీఎస్‌ఎల్‌ 2016-17లో రూ. 61.66 కోట్ల లాభాలు నమోదు చేసింది.



You may be interested

ప్రభుత్వ సంస్థల్లో షేర్ల బైబ్యాక్‌

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లు బైబ్యాక్ చేసేందుకు దాదాపు పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్‌ఈ) కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్‌ఎ౾ండీసీ, ఎన్ఎల్‌సీ, భెల్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌బీసీసీ, ఎస్‌జేవీఎన్‌, కేఐవోసీఎల్‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇటీవలే ఆయా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ లిస్టును రూపొందించింది. అయితే, ఆయా

టెమాసెక్‌తో ఇన్ఫోసిస్ జట్టు

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమసెక్‌తో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసింది. ఈ జేవీ కింద టెమసెక్‌తో పాటు దాని క్లయింట్లకు ఇన్ఫోసిస్ డిజిటల్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం టెమసెక్‌ సింగపూర్ విభాగమైన ట్రస్టెడ్ సోర్స్‌తో ఇన్ఫీ టీమ్ జతకట్టనుంది. ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్‌లో ఇన్ఫోసిస్‌కు 60 శాతం, టెమసెక్‌కు 40 శాతం వాటాలుంటాయి. సింగపూర్ కేంద్రంగా పనిచేసే టెమసెక్‌ ప్రస్తుతం

Most from this category