STOCKS

News


ధరల నియంత్రణల్లోకి కేన్సర్‌ ఔషధాలు

Thursday 28th February 2019
Markets_main1551337844.png-24374

  • నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 40 డగ్స్‌కు చోటు

న్యూఢిల్లీ: కేన్సర్‌ చికిత్సల్లో వినియోగించే నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 ఔషధాలను ధరల నియంత్రణల విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఔషధాల విక్రయ ధరలపై 30 శాతం మార్జిన్‌ను గరిష్ట పరిమితిగా విధించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఫార్మాస్యూటికల్‌ ధరల నిర్ణయాక మండలి (ఎన్‌పీపీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఔషధ విభాగం తన ప్రకటన ద్వారా తెలియజేసింది. ‘‘ఔషధ చట్టం 2013లోని పారాగ్రాఫ్‌ 19 కింద ప్రభుత్వం ఇకపై వ్యాపార మార్జిన్‌ను 30 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 ఔషధాలపై మార్జిన్‌ను ఖరారు చేయాలని తయారీదారులకు ఆదేశించడం జరిగింది’’ అని ఫార్మాస్యూటికల్స్‌ విభాగం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 105 బ్రాండ్ల ధరలు 85 శాతం వరకు తగ్గనున్నాయని, ఫలితంగా వినియోగదారులకు రూ.105 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని ఈ నోటిఫికేషన్‌ తెలిపింది.



You may be interested

రూ.20,000 కోట్ల జీఎస్టీ ఎగవేత

Thursday 28th February 2019

ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో గుర్తింపు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు రూ.20000 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10,000 కోట్ల మేర రికవరీ చేసినట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ సభ్యుడు జాన్‌జోసెఫ్‌ తెలిపారు. మోసాల నివారణకు, నిబంధనలు పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కేవలం 5-10 శాతం మంది

వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ మూసివేయం:ఏఏఐ

Thursday 28th February 2019

హైదరాబాద్‌: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్‌ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు. దీనికి కారణం ఈ ప్రతిపాదనను

Most from this category