STOCKS

News


ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు

Wednesday 2nd January 2019
news_main1546409848.png-23360

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి చైర్మన్‌గా ప్రస్తుత ఎండీ హేమంత్‌ భార్గవ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎల్‌ఐసీ చైర్మన్‌గా వీకే శర్మ డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. హేమంత్‌ భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్‌ఐసీ ఎండీ బాధ్యతల్లో ఉన్నారు.
చైర్మన్‌ పదవికి ఇంటర్వ్యూలు
ఎల్‌ఐసీ చైర్మన్‌, ఎండీ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖ సెక్రటరీ బీపీ శర్మ ఆధ్వర్యంలోని బ్యాంకు బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎండీగా ఉషా సంగ్వాన్‌ పదవీకాలం గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిపోవడంతో ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఎల్‌ఐసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో ఒక చైర్మన్‌, నలుగురు ఎండీలుంటారు. చైర్మన్‌, ఎండీ పదవుల కోసం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు సంబంధిత వర్గాల కథనం. ఎల్‌ఐసీలోనే అధికారుల స్థాయిలో ఉన్న ఎంఆర్‌ కుమార్‌, హెచ్‌ఎస్‌ శశికుమార్‌, టీసీ సుషీల్‌కుమార్‌ (హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌), ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో రాజ్‌కుమార్‌ తదితరులు రేసులో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఎండీ పదవుల్లో ఉన్న సునీతా శర్మ ఈ ఏడాది మార్చిలో రిటైర్‌ కానున్నారు. అలాగే బి. వేణుగోపాల్‌ మే నెలలో, హేమంత్‌ భార్గవ జూలైలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.You may be interested

పెట్రోల్‌, డీజిల్‌ కంటే విమాన ఇంధనమే చౌక!

Wednesday 2nd January 2019

భారీగా తగ్గిన రేట్లు న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరను కిలోలీటర్‌కు రూ.9,990 (14.7 శాతం) తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.58,060కు దిగొచ్చింది. అంటే లీటర్‌ ధర రూ.58.06. ఢిల్లీ మార్కెట్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.68.65తో పోలిస్తే తక్కువకు అందుబాటులోకి వచ్చింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ.62.66 కంటే కూడా చౌకగా మారింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు ఇది పెద్ద

జెట్‌ ఎయిర్‌వేస్‌ డిఫాల్ట్‌!

Wednesday 2nd January 2019

నిధుల కొరత, రుణభారంతో కుదేలవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తింది. డిసెంబర్‌ చివరకు బ్యాంకుల కన్సార్టియంకు చెల్లించాల్సిన అసలు, వడ్డీని చెల్లించలేకపోయామని కంపెనీ తాజాగా స్టాక్‌ ఎక్చేంజ్‌లకు తెలియజేసంది. నిధుల ప్రవాహంలో ఏర్పడ్డ తాత్కాలిక ఇబ్బందులతో డిఫాల్ట్‌ అయినట్లు వివరించింది. నిధుల కొరత కారణంగా కొందరు రుణదాతలకు చెల్లింపులను సకాలానికి చేయలేకపోవచ్చని ఇటీవలే కంపెనీ ప్రకటించింది. లోన్‌ రీపేమెంట్‌ చేయలేక డిఫాల్ట్‌ కావడం కంపెనీ

Most from this category