STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ అందిస్తాం: జైట్లీ

Monday 24th September 2018
news_main1537768968.png-20515

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), మ్యూచువల్‌ ఫండ్స్‌కు (ఎంఎఫ్‌లు), చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈలు) లిక్విడిటీ అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ భరోసానిచ్చారు. సోమవారం ఉదయం ఆయన ఒక ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడంతో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం వల్ల శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారిపోయిన విషయం తెలిసిందే. ఇండియన్‌ స్టాక్స్‌ మార్కెట్లు, ఫారెక్స్‌ మార్కెట్లు, బాండ్‌ మార్కెట్లు తీవ్రమైన ఒదిదుడుకులను ఎదుర్కొన్న నేపథ్యంలో జైట్లీ తాజా ట్వీట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను పెంచేందుకు ఫైనాన్షియల్‌ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఒక ప్రకటన విడుదల చేశాయి. అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. 



You may be interested

కొనసాగుతున్న రియల్టీ షేర్ల పతనం

Monday 24th September 2018

రియల్టీ షేర్ల పతనం వరుసగా రెండోరోజూ కొనసాగుతోంది. గత ట్రేడింగ్‌లో 3.50శాతం నష్టపోయిన నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ తాజాగా సోమవారం ట్రేడింగ్‌లో మరో 4.50శాతం వరకు నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు రియల్టీ ఇండెక్స్‌ గతముగింపు(248.70)తో పోలిస్తే 4శాతం నష్టంతో 239.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 9షేర్లలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ షేరు 7శాతం నష్టంతో

11000- 11400 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 24th September 2018

స్వల్పకాలానికి నిపుణుల అంచనా రూపాయి పతనం, క్రూడాయిల్‌ ధర పెరుగుదలతో సూచీల్లో ఆరంభమైన పతనాన్ని పెరిగిన బాండ్‌ ఈల్డ్స్‌, కంపెనీల క్రెడిట్‌ సమస్యలు మరింత వేగవంతం చేశాయి. దీంతో సూచీలు రోజురోజుకీ కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తూపోతున్నాయి. ఇండియా వీఐఎక్స్‌ ప్రస్తుతం 15.36 స్థాయిలకు పైన ట్రేడవుతూ మరింత పతనాన్ని సూచిస్తోంది. శుక్రవారం ఇందుకు సూచనగా సూచీలు, స్టాకులు ఒక్కమారుగా ఢమాల్‌మని చివర్లో కాస్త రికవరీ అయ్యాయి. నిఫ్టీ 11320కి దిగువన

Most from this category