STOCKS

News


రైట్స్‌లో 15 శాతం వాటా విక్రయం !

Thursday 16th May 2019
news_main1557992284.png-25773

  • ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానానికి మొగ్గు
  • రూ.700 కోట్లు సమీకరిస్తుందని అంచనా

న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన రైట్స్‌ కంపెనీలో 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్లు రాగలవని అంచనా. ఈ ఓఎఫ్‌ఎస్‌కు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌  అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఇటీవలే ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. రైట్స్‌లో  కేంద్రానికి 87.40 శాతం వాటా ఉంది. 
గత ఏడాది జూలైలోనే రైట్స్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. 67 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ప్రభుత్వానికి రూ.466 కోట్లు వచ్చాయి. రూ.185 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన రైట్స్‌ షేర్‌ స్టాక​ మార్కెట్లో రూ.190 వద్ద లిస్టయింది. ఓఎఫ్‌ఎస్‌ వార్తల నేపథ్యలో బీఎస్‌ఈలో రైట్స్‌ షేర్‌ 4 శాతం నష్టంతో రూ.233 వద్ద ముగిసింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2,350 కోట్లు సమీకరించాలని దీపమ్‌ లక్ష్యించుకుంది. ఇప్పటివరకూ రూ.2,350 కోట్లు సమీకరించింది. రైల్‌ వికాస్‌ నిగమ్‌ ఐపీఓ, శతృ ఆస్తుల విక్రయం ద్వారా ఈ నిధులను కేంద్రం సమీకరించింది. 



You may be interested

చలో విదేశీ... చాలా ఈజీ!!

Thursday 16th May 2019

అంతర్జాతీయ సంస్థల రాకతో మారిన చిత్రం చిన్న సంస్థలూ విదేశాల్లో విక్రయించొచ్చు  తేలిగ్గా ఉత్పత్తులను చేరవేసే అవకాశం  వాల్‌మార్ట్‌, అమెజాన్‌ ప్రత్యేక కార్యక్రమాలు న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌ మొదట్లో చాలా చిన్న కంపెనీ. కానీ పదేళ్ల కిందట వాల్‌మార్ట్‌ హోమ్‌ బ్రాండ్‌ కెనోపీతో ఒప్పందం కుదుర్చుకోవటం ఈ సంస్థకు అనూహ్యంగా కలిసి వచ్చింది. బెడ్‌షీట్లు, ఫ్యాషన్‌ బెడ్డింగ్‌ ఉత్పత్తులు విక్రయించే ఈ సంస్థ... దేశీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావటమే కాక... ప్రస్తుతం

రూ.1,400 కోట్లు సమీకరించిన గ్రోఫర్స్‌

Thursday 16th May 2019

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ రిటైల్‌ సంస్థ గ్రోఫర్స్‌... సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి 200 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు) సమీకరించింది. సిరీస్‌ ఎఫ్‌ కింద జరిగిన ఈ నిధుల సమీకరణలో కొత్త ఇన్వెస్టర్‌ కేటీబీతోపాటు ప్రస్తుత వాటాదారులైన టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, సీక్వోయ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టినట్టు గ్రోఫర్స్‌ ప్రకటించింది. ఈ నిధులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించాలని భావిస్తున్నట్లు, తద్వారా కోట్లాది భారతీయ వినియోగదారులకు

Most from this category