STOCKS

News


ఫుడ్‌ ప్రాసెస్‌ రంగానికి ఎన్‌బీఎఫ్‌సీ

Saturday 1st December 2018
news_main1543643444.png-22543

న్యూఢిల్లీ: ఆహార శుద్ధి రంగంలో కంపెనీలకు రుణ సాయం అందించేందుకు గాను రూ.2,000 కోట్ల నిధితో ఓ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని (ఎన్‌బీఎఫ్‌సీ) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఇది భాగమని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తెలిపారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ఎన్‌బీఎఫ్‌సీ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించానని, ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందుంచనున్నట్టు ఆమె చెప్పారు. 42 మెగా ఫుడ్‌ పార్క్‌లకు గత నాలుగున్నరేళ్లలో అనుమతించగా, అందులో 15 పార్క్‌లను ఇప్పటికి ప్రారంభించినట్టు తెలిపారు. 



You may be interested

అక్రమార్కులకు వ్యతిరేకంగానే నోట్లరద్దు

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) నిర్ణయం అవినీతిపై పోరాటంలో భాగంగా తీసుకున్నదే కానీ, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం చెప్పినట్టు ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా కాదని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ‘మోదీ- జైట్లీ ఆర్థిక విధానంతో సవాళ్లు’ పేరిట సుబ్రమణ్యం తాజాగా రాసిన పుస్తకంలో డీమోనిటైజేషన్‌ను దారుణమైన నిర్ణయంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. సీఐఐ

గవర్నెన్స్ లోపాలే రాణా ఉద్వాసనకు కారణం

Saturday 1st December 2018

ముంబై: యస్‌ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ నిరాకరించడానికి గవర్నెన్స్‌ లోపాలు, నిబంధనలను పాటించడంలో వైఫల్యాలే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న అప్పటి చైర్మన్ అశోక్‌ చావ్లాకు రాసిన లేఖలో ఆర్‌బీఐ ఈ విషయాలు పేర్కొన్నట్లు వివరించాయి. రుణాల నిర్వహణ విధానాలకు సంబంధించి బ్యాంక్‌లో పెద్ద యెత్తున అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆ లేఖలో పేర్కొంది. అలాగే, రాణా కపూర్

Most from this category