ఎయిరిండియా అనుబంధ సంస్థల విక్రయంపై కేంద్రం కసరత్తు
By Sakshi

న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకి చెందిన నాలుగు అనుబంధ సంస్థలను విక్రయించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్ (ఏఏఎస్ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌సీఐ), ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఏఐఏటీఎస్ఎల్), ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీస్ (ఏఐఈఎస్ఎల్)ను వ్యూహాత్మకంగా విక్రయించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, న్యూఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం భవంతితో పాటు కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇతరత్రా స్థలాలు, భవంతులను కూడా విక్రయించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు వివరించాయి. గతేడాది మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియాకు రూ. 48,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంస్థలో వ్యూహాత్మకంగా వాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ.. తగిన స్పందన లేకపోవడంతో ప్రతిపాదన అటకెక్కింది.
You may be interested
కీలక అవరోధ శ్రేణి 38,360-38,422
Monday 17th September 2018మన మార్కెట్లో రెండు వారాల క్రితం మొదలైన డౌన్‌ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ, పతనం ఎంత వేగంగా వుంటున్నదో, రికవరీ సైతం అంతే త్వరితంగా జరుగుతున్నది. అయితే తాజా బౌన్స్ల్లో హెవీవెయిట్ షేర్లు ఏవీ కూడా కొత్త గరిష్టస్థాయిల్ని నమోదు చేయలేకపోతున్నాయి. సూచీలు మళ్లీ కొత్త రికార్డుల్ని నెలకొల్పాలంటే, హెవీవెయిట్ షేర్లు తొలుత ముందడుగు వేయాల్సివుంటుంది. లేకపోతే, మార్కెట్ కరెక్షన్ కొనసాగే ప్రమాదం వుంటుంది. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు కేంద్రం పలు చర్యల్ని
రూపాయి, ముడిచమురు ధరలే కీలకం
Monday 17th September 2018జారుడు బల్లపై ప్రయాణం చేస్తున్న రూపాయి దిశను మార్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రకటించిన పలు అంశాల ప్రభావం సోమవారం మార్కెట్ కదలికలలో స్పష్టంగా కనిపించనుందని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉంచడం, విదేశీ నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగేలా చూడడంలో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన అంశాలు ఈవారంలో మార్కెట్‌కు నడిపించనున్నాయని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్