News


బీఎస్‌ఎన్‌ఎల్‌పై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు

Tuesday 19th February 2019
Markets_main1550561886.png-24259

  • నిర్ణయాల్లో జాప్యంతో ప్రైవేటు కంపెనీలకు లబ్ధి
  • ఉద్యోగుల సంఘం ఆరోపణ

న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి మూడు రోజుల సమ్మెకు దిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నించటం లేదని, తద్వారా ప్రైవేటు టెలికం కంపెనీలకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తోందని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. 4జీ సేవలకు గాను బీఎస్‌ఎన్‌ఎల్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు, భూ నిర్వహణ విధానం, వేతన సవరణ కమిటీ ఏర్పాటు, పెన్షన్‌ చందాల సర్దుబాటు వంటివి ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులతో సంప్రతింపులు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం బోగస్‌ ప్రకటన జారీ చేసింది. 15 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలన్నది మా ప్రధాన డిమాండ్‌. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్నాం కనుకే 15 శాతం స్థానంలో 5 శాతం ఫిట్‌మెంట్‌ను ఆమోదిస్తామని టెలికం శాఖకు తెలియజేశాం. కానీ, ఈ విషయం ప్రభుత్వ ప్రకటనలో లేదు’’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ అల్‌ ఇండియా యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్స్‌ (ఏయూఏబీ) కన్వీనర్‌ పి.అభిమన్యు తెలిపారు. ఫిబ్రవరి 1న సమ్మె నోటీసు ఇవ్వగా, ఇంత వరకు చర్చల కోసం ఉద్యోగ సంఘాలను పిలవలేదన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని, భూముల విక్రయం ద్వారా నిధుల సమీకరించేందుకు అనుమతించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం తేల్చడం లేదన్నారు. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.13వేల కోట్ల రుణం ఉంది. వొడాఫోన్‌ ఐడియాకు రూ.1.2 లక్షల కోట్లు, ఎయిర్‌టెల్‌కు రూ.1.06 లక్షల కోట్లు, జియోకు రూ.2 లక్షల కోట్ల మేర రుణాలున్నాయి. ఇవి దేశీయ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నాయి. అది ప్రజాధనమే. కానీ, టెలికం శాఖ మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యకలాపాల కోసం రుణాలు తీసుకునేందుకు సమ్మతి తెలపడం లేదు’’ అని అభిమన్యు పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా సమ్మె
దేశవ్యాప్తంగా 98 శాతం మంది ఉద్యోగులు సమ్మెకు వెళ్లినట్టు ఏయూఏబీ పేర్కొనగా... 60-70 శాతం మంది ఉద్యోగులే సమ్మెలోకి వెళ్లారని, కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయంలో మాత్రం 90 శాతం ఉద్యోగులు హాజరయ్యారని ఓ అధికారి తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు అంశాన్ని ట్రాయ్‌ అభిప్రాయాల కోసం నివేదించామని టెలికం శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే, బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుజ్జీవనానికి సంబంధించి ఓ సమగ్ర  ప్రతిపాదనను కూడా సిద్ధం చేశామని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నామని తెలిపింది.You may be interested

ఈ కంపెనీల దిశ మారింది!

Wednesday 20th February 2019

డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల్లో 43 కంపెనీలు టర్న్‌ అరౌండ్‌ అయిన సంకేతాలు ఇచ్చాయి. అంటే ఓ కంపెనీ కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉండి అనంతరం లాభాల్లోకి అడుగుపెట్టడాన్ని టర్న్‌ అరౌండ్‌గా చెబుతారు. ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, సిండికేట్‌ బ్యాంకు, డిష్‌ టీవీ, ఓబీసీ, బిర్లా కార్ప్‌, ఐనాక్స్‌ విండ్‌, ఆస్ట్రా జెనెకా ఫార్మా తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీల్లో చాలా వరకు గత ఏడాది కాలంలో 60

డీజిల్ కార్లకు ఇక చెల్లు చీటీ?

Tuesday 19th February 2019

నిలిపివేతపై చర్చల్లో మారుతీ సుజుకీ సీఎన్‌జీ కార్లపై దృష్టి పెట్టాలన్న యోచన పెట్రోల్ వెర్షన్లపై మహీంద్రా కసరత్తు కఠినతర కాలుష్య ప్రమాణాలే కారణం న్యూఢిల్లీ: పెట్రోల్‌తో పోలిస్తే కాస్త ఎక్కువ మోతాదులో కాలుష్యకారక వాయువులు విడుదల చేసే డీజిల్‌ ఇంధన వినియోగంపై నియంత్రణలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. పరిస్థితి బట్టి డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా నిలిపివేసే అంశాలనూ పరిశీలిస్తున్నాయి. దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇదే అంశంపై మాతృ సంస్థ

Most from this category