STOCKS

News


బ్యాంకులకు మూలధన సాయం రూ.65,000 కోట్లు: ఇక్రా

Thursday 13th December 2018
news_main1544677930.png-22887

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.65,000 కోట్ల రీక్యాపిటలైజేషన్‌ సాయాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో మార్పు ఉండకపోవచ్చని రేటింగ్‌ సంస్థ ఇక్రా తెలిపింది. ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులకు గాను, 11 ‍బ్యాంకులు ఆర్‌బీఐ కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వీటిల్లో ఎక్కువ బ్యాంకులు 2020 ఆర్థిక సంవత్సరం తర్వాతే పీసీఏ కార్యాచరణ నుంచి బయటకు రాగలవని పేర్కొంది. నియంత్రణ సంస్థ క్యాపిటల్‌ రేషియోను దాటిపోయిన బ్యాంకుల విషయంలోనే మూలధన సాయాన్ని పరిమితం చేయవచ్చని అభిప్రాయపడింది. 



You may be interested

మహిళా ఉద్యోగులకు ఐసీఐసీఐ బంపర్‌ ఆఫర్‌

Thursday 13th December 2018

ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌... మహిళా ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ ఉమన్ ఔరా సేవింగ్స్ అకౌంట్‌’ పేరుతో ఉద్యోగినులకు ప్రత్యేక ఖాతాను అందిస్తోంది. ఈ అకౌంట్‌ తీసుకున్న వారికి డెబిట్‌ కార్డ్‌ వాడకంపై రూ.750 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌, ఎటువంటి చార్జీలు లేని అపరిమిత ఏటీఎం కార్డ్‌, లాకర్‌ చార్జీలపై 50 శాతం డిస్కౌంట్‌, గృహ రుణాల ప్రాసెసింగ్‌ ఫీజులో డిస్కౌంట్‌ వర్తిస్తుందని పేర్కొంది.

మొండి బకాయిలు వసూలు కావు... జాగ్రత్త

Thursday 13th December 2018

న్యూఢిల్లీ: ఉర్జిత్‌పటేల్‌ ఆకస్మిక రాజీనామా... ఆర్‌బీఐ విధానాల ప్రాధాన్యతల విషయంలో ఉన్న రిస్క్‌ను తెలియజేస్తోందని రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ పేర్కొంది. కేంద్ర బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరగడాన్ని ఇది తెలియజేస్తోందని, మొండి బకాయిల పరిష్కారానికి ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాలకు దీనివల్ల విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పటేల్‌ రాజీనామా కారణంగా ఏర్పడే సమస్యలన్నవి కొత్తగా వచ్చిన శక్తికాంత దాస్‌ సారథ్యంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తేటతెల్లం అవుతాయని పేర్కొంది. ‘‘వృద్ధిని వేగవంతం

Most from this category