STOCKS

News


భారత ఆహ్వానం అందుకున్న హువావే

Saturday 6th October 2018
news_main1538802586.png-20914

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ 'హువావే'కు భారత ప్రభుత్వ ఆహ్వానం అందింది. ప్రస్తుతం భారత్‌లో కొనసాగుతున్న 5జీ ట్రయల్స్‌లో భాగస్వామి కావాలని కోరుతూ టెలికం శాఖ సెప్టెంబరు 27న తమకు అధికారికంగా ఆహ్వానం ఇచ్చిందని సంస్థ ఇండియా సీఈఓ జే చెన్ వెల్లడించారు. ‘ట్రయల్స్‌ కోసం ప్రాంతాల ఎంపికకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, 5జీ ట్రయల్స్‌కు 100 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రం కేటాయించాలని భావిస్తున్నామని టెలికం శాఖ చెప్పింది. ఢిల్లీతో పాటు మరో ప్రాంతంలో ట్రయల్స్‌ నిర్వహించడానికి హువావే సిద్ధంగా ఉన్నట్లు మేం సమాధానం ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కలిసిపనిచేయాలని అనుకుంటున్నాం. వచ్చే 5 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్రియాశీలకంగా ఉండనుందని భావిస్తున్నాం. ఇందుచేత దీర్ఘకాల పెట్టుబడి దృష్యా ఇక్కడ మార్కెట్‌ను చూస్తున్నాం. అంతా సవ్యంగా కొనసాగితే భారత టెలికం రంగంలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.’ అని వ్యాఖ్యానించారు. 
2020 నాటికి 5జీ
5జీ అప్లికేషన్స్‌ అభివృద్ధి, ట్రయల్‌ రన్స్‌ కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సిస్కో, ఎన్‌ఈసీ సంస్థలను ఆహ్వానించింది. 2019 రెండవ అర్థభాగంలో 5జీ సర్వీస్‌ స్పెక్ట్రం వేలం పాట నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెలికం శాఖ సూచన మేరకు 8,644 మెగాహెడ్జ్‌ ఫ్రీక్వెన్సీల వేలం పాట జరుగనుండగా.. ఇందుకు బేస్‌ ప్రైస్‌ రూ.4.9 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య పరంగా ఈ టెక్నాలజీ 2020 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. You may be interested

బైక్‌ రైడ్‌ కావాలా? అయితే ‘రాపిడో’..!!

Saturday 6th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్‌ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్‌ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్‌ కరెక్ట్‌!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్‌ పూర్వ విద్యార్థుల త్రయం.

మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి ‘ఏఎంజీ జీ 63’

Saturday 6th October 2018

న్యూఢిల్లీ: జర్మకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ శుక్రవారం దేశీ మార్కెట్‌లో సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని (స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌) విడుదల చేసింది. ‘ఏఎంజీ జీ 63’ పేరుతో విడుదలైన ఈ వాహనం కేవలం 4.5 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ప్రకటించింది. 4-లీటర్‌ వీ8 బైటర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ ఎస్‌యూవీ ధర రూ.2.19 కోట్లుగా నిర్ణయించింది. ‘స్పోర్ట్స్‌

Most from this category