STOCKS

News


ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు

Saturday 29th December 2018
news_main1546056876.png-23305

న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. సెయిల్‌ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్‌ పరిశ్రమ చాలా ప్రత్యేకమైది. ఈ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుకోవల్సిన అవసరం భారత ప్రభుత్వంపై ఉందని వారికి చెప్పాం. అయితే, చర్చల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.’ అని మీడియాతో చెప్పారాయన. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌... మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను విధించటం తెలిసిందే.



You may be interested

ఆరు నెలల్లో ఎన్‌పీఏలు రూ.23,000 కోట్లు తగ్గాయి

Saturday 29th December 2018

ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) రూ.23,860 కోట్లు తగ్గాయని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. 2018 మార్చి నాటికి రూ.9.62 లక్షల కోట్లకు చేరగా ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఇదే

సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.200 కోట్లు

Saturday 29th December 2018

- ఈసాప్స్‌ ద్వారా సమీకరణ - ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజింగ్‌ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్‌) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని బ్యాంక్‌ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం

Most from this category