STOCKS

News


ట్రాయ్ చైర్మన్‌గా శర్మ కొనసాగింపు

Friday 10th August 2018
news_main1533897564.png-19141

న్యూఢిల్లీ: ఆధార్ నంబరు చాలెంజ్‌తో వివాదాస్పదమైన టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2020 సెప్టెంబర్ 30 దాకా మరో రెండేళ్ల పాటు ట్రాయ్ చైర్మన్‌గా ఆయన్ను కొనసాగించే ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. 2015 జూలైలో మూడేళ్ల కాలానికి ఆయన ట్రాయ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1982 బ్యాచ్ జార్ఖండ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి (రిటైర్డ్‌) అయిన శర్మ... ఆధార్ ప్రాజెక్టులో కీలక పాత్ర కూడా పోషించారు. కేవలం ఆధార్ నంబర్‌ ఆధారంగా ఎవరికీ హాని తలపెట్టలేరని రుజువు చేసేందుకు తన ఆధార్ నంబరును బహిరంగంగా వెల్లడించడం ద్వారా... ఇటీవల ఆయన ‍హ్యాకర్లకు చాలెంజ్ విసరడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ట్రాయ్ చైర్మన్‌గా ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. కాల్‌ కనెక్ట్ చార్జీలను తగ్గించేయడం, అనవసర కాల్స్‌.. మెసేజీల బెడద తగ్గించడానికి ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు మొదలైన వాటితో టెలికం పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. 



You may be interested

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనద్దు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి జేపీ గ్రూప్‌కు అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌పై  (జేఐఎల్‌) తాజాగా దివాలా ప్రక్రియ ప్రారంభించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎస్‌సీఎల్‌టీ) అలహాబాద్‌ బెంచ్‌ను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఈ బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనవద్దని జేఐఎల్‌తోపాటు మాతృసం‍స్థ జేపీ గ్రూప్‌కు, ప్రమోటర్లకు కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దివాలా చట్టం (ఐబీసీ) కింద జేఐఎల్‌ హోల్డింగ్‌

అపరాధ భావన తొలిచేస్తోంది..

Friday 10th August 2018

ముంబై: షేరు పతనం కారణంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుండటంపై జెట్‌ ఎయిర్‌వేస్ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి తనకు 'సంకటంగా మారిందని, అపరాధ భావన' కలిగిస్తోందని  ఆయన వ్యాఖ్యానించారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా మంది షేర్‌హోల్డర్లు నష్టపోయారు. ఏదో అపరాధం చేసిన భావన తొలిచేస్తోంది.

Most from this category