STOCKS

News


నిరంతరాయ పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు

Saturday 16th February 2019
news_main1550315360.png-24229

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారులు బహిరంగ ప్రదేశాల్లో నిరంతరాయంగా పబ్లిక్ వై-ఫై సేవలు పొందేలా ఇంటరాపరబిలిటీ విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌, సర్వీస్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. ఇది ఇటు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండటంతో  పాటు ‍అటు చిన్న స్థాయి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కొంత ఆదాయ వనరుగా కూడా ఉండగలదని ఆమె తెలిపారు. "ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ లాంటి వాటికి వెళ్లిన ప్రతీసారి లాగిన్ కావాల్సి వస్తోంది. మన సర్వీస్ ప్రొవైడర్ వై-ఫైని ప్యాకేజీగా ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చెల్లించాల్సి వస్తోంది. అదే ఇంటరాపరబిలిటీ గానీ అమల్లోకి వచ్చిన పక్షంలో ఒక్కసారి చెల్లించి, లాగిన్ అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సర్వీస్ ప్రొవైడర్‌ నుంచైనా నిరంతరాయంగా ఇంటర్నెట్ సర్వీసులు పొందడానికి వీలవుతుంది" అని అరుణ పేర్కొన్నారు.



You may be interested

10600 పాయింట్లు కోల్పోతే మరిన్ని ఇక్కట్లు!

Saturday 16th February 2019

దేశీయ మార్కెట్లు ఈ వారమంతా పతనాన్ని కొనసాగించాయి. సన్‌ఫార్మా, యూబీ, ఎంఎంటీసీలాంటి కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటించినా సూచీల్లో పాజిటివ్‌ స్పందన కనిపించలేదు. రాజకీయ అస్థిరత,  అధిక వాల్యూషన్ల కారణంగా పలు స్టాకుల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఎక్కువైంది. లార్జ్‌క్యాప్‌ దిగ్గజాలు నేల చూపులు చూడడంతో సూచీలు నష్టాల్లో వారాన్ని ముగించాయి. అయితే మార్కెట్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా నమోదవుతుండడంతో బేర్స్‌ పట్టు కోల్పోతున్నారని నిపుణులు భావిస్తున్నారు. క్రూడాయిల్‌ ధరలు కాస్త

ఆభరణాల మార్కెట్‌లో రెట్టింపు వాటా

Saturday 16th February 2019

3-4 ఏళ్లలో టైటాన్ లక్ష్యం 2018-19లో కొత్తగా 40 తనిష్క్ స్టోర్స్ ప్రారంభం వివాహ, వజ్రాభరణాలపై ఎక్కువ దృష్టి బెంగళూరు: వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆభరణాల మార్కెట్లో వాటాను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని టైటాన్ సంస్థ నిర్దేశించుకుంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉంది. తాజా లక్ష్యాన్ని చేరుకునేందుకు వెడ్డింగ్ విభాగం, అధిక విలువ వజ్రాభరణాలు, గోల్డెన్ హార్వెస్ట్ కొనుగోలు స్కీమ్‌, కస్టమర్లకు ఎక్స్చేంజ్ ప్రోగ్రాం తోడ్పడగలవని కొత్త

Most from this category