News


తొలిసారిగా రూ. 20 నాణేలు

Friday 8th March 2019
Markets_main1552023894.png-24485

  • రూ. 1, 2, 5, 10 కాయిన్స్‌లో కొత్త సిరీస్‌

న్యూఢిల్లీ: కేంద్రం తొలిసారిగా రూ.20 నాణేలను ఆవిష్కరించింది. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని డిజైన్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో తెలిపారు. దీనితో పాటు రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 నాణేల్లో కూడా కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అంధులు కూడా సులువుగా గుర్తించగలిగే రీతిలో వీటిని డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు. కొత్త సిరీస్ నాణేలను మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేసేదీ నిర్దిష్ట తేదీ ఇంకా వెల్లడించలేదు. రూ.20 నాణెం బరువు సుమారు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. పాత, కొత్త నాణేలకు మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించేలా ఈ కాయిన్స్‌ ముద్రణ ఉంటుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు.



You may be interested

వేతనాల్లో మహిళలకు అన్యాయమే

Friday 8th March 2019

- పురుషులతో పోలిస్తే 19 శాతం తక్కువ - మాన్‌స్టర్ శాలరీ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పటికీ.. వేతనాల విషయం వచ్చేసరికి మాత్రం పురుషుల ఆధిక్యతే కొనసాగుతోంది. భారత్‌లో పురుషుల, మహిళల వేతనాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది. పురుషులతో పోలిస్తే మహిళల వేతనాలు 19 శాతం తక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పురుషులు, మహిళల వేతనాల వ్యత్యాసాలకు

రూ. 20 కడితే ఆధార్ సర్వీసులు

Friday 8th March 2019

ఈ-కేవైసీ కోసం వ్యాపార సంస్థలకు యూఐడీఏఐ నోటిఫికేషన్‌ న్యూఢిల్లీ: కస్టమర్ ధృవీకరణ కోసం (కేవైసీ) ఆధార్ సర్వీసులు వినియోగించుకోవాలంటే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్‌కు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీ ధృవీకరణ కోసం 0.50 పైసలు చెల్లించాల్సి రానుంది. విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డుల సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. "ఆధార్ ధృవీకరణ సర్వీసులకోసం

Most from this category