STOCKS

News


స్థానిక సమాచారం కోసం గూగుల్‌ నైబ్లరీ

Saturday 24th November 2018
news_main1543046066.png-22365

  • రెండు వారాల్లో దేశవ్యాప్తంగా
  • సీనియర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ బెన్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్థానిక సమాచారం కోసం చాలా సందర్భాల్లో ఇంటిదగ్గర వారిని సంప్రదిస్తాం. అదే వేరే ప్రాంతానికి వెళ్తే రోడ్డునపోయే అపరిచితులను అడగాల్సి వస్తుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరో అడుగు ముందుకేసి ‘నైబర్లీ’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఖాతా ఉన్న బ్యాంకు ఎస్‌బీఐ అనుకుందాం. ఏటీఎంకు వెళ్లాల్సి వస్తే.. ఎస్‌ఎంఎస్‌ లేదా వాయిస్‌ రూపంలో ‘దగ్గరలో ఎస్‌బీఐ ఏటీఎం ఎక్కడ ఉంది’ అని అడిగితే చాలు. నైబర్లీ యాప్‌ను వాడుతున్న అక్కడి ప్రాంతం వారు ఎస్‌ఎంఎస్‌ రూపంలో యూజర్లు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తారు. బాగా స్పందించే వారికి టాప్‌ నైబర్‌ స్టేటస్‌ ఇస్తారు. నోటిఫికేషన్ల పరిమితిని యూజర్లు సెట్‌ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా త్వరలో..
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైజాగ్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. నేటి (శనివారం) నుంచి హైదరాబాద్‌లో పనిచేయనుంది. రెండు వారాల్లో దేశవ్యాప్తంగా నైబర్లీ సేవలను అందుకోవచ్చని గూగుల్‌ సీనియర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ బెన్‌ ఫోనర్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘నైబర్లీ యాప్‌ను భారత మార్కెట్‌ కోసం దేశీయంగా అభివృద్ధి చేశాం. ప్రస్తుతం ఇంగ్లీషుతోపాటు తెలుగు వంటి ఎనిమిది భారతీయ భాషల్లో యాప్‌ పనిచేస్తుంది. అవసరమైతే మరిన్ని స్థానిక భాషలను జోడిస్తాం. 15 లక్షల మందికిపైగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. భారతీయులది స్నేహపూర్వక మనస్తత్వం కాబట్టే తొలుత నైబర్లీని ఇక్కడ అమలులోకి తెచ్చాం. ఇతర దేశాలకు ఈ యాప్‌ను పరిచయం చేసే అవకాశమూ ఉంది’ అని వివరించారు.



You may be interested

ప్రాపర్టీకలకు అడ్డా హనీగ్రూప్‌

Saturday 24th November 2018

 – ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు అన్నీ ఒక్క చోటే – 230 నిర్మాణ సంస్థలు; 360 ప్రాజెక్ట్‌లతో ఒప్పందం – ప్రస్తుతం 310 మంది ఉద్యోగులు; ఏడాదిలో 1,000 మంది లక్ష్యం – ‘స్టార్టప్‌ డైరీ’తో హనీగ్రూప్‌ సీఎండీ ఓబుల్‌ రెడ్డి అపార్ట్‌మెంట్స్, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు ఏవైనా కానివ్వండి.. ఒక్కో దానికి ఒక్కో నిర్మాణ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేదు. జస్ట్‌! హనీగ్రూప్‌లో లాగిన్‌ అయితే చాలు. ఒకే చోట అన్ని రకాల

పీసీఏతో ఆబ్యాంకులకు అంతా అయిపోలేదు

Saturday 24th November 2018

ముంబై: మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారంతో కూరుకుపోయిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లాయి. అయితే దీనితో రుణాల మంజూరీకి సంబంధించి ఆ బ్యాంకుల పని  అయిపోయినట్లేనని భావించవద్దని అమెరిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- జఫ్రీస్‌ పేర్కొంది. 2015 మార్చిలో మొత్తం రిటైల్‌ రుణాల్లో ఈ 11 బ్యాంకుల వాటా 15 శాతం అయితే, 2018 సెప్టెంబర్‌లో ఈ

Most from this category