STOCKS

News


పెమెంట్స్‌ సేవల విషయంలో నిబంధనలు పాటిస్తాం: గూగుల్‌

Tuesday 11th September 2018
news_main1536643058.png-20162

న్యూఢిల్లీ: పేమెంట్‌ సేవలకు సంబంధించిన డేటాను స్థానికంగానే నిల్వ చేయాలన్న ఆర్‌బీఐ నిబంధనలను పాటిస్తామని గూగుల్‌ తెలిపింది. అయితే, ఇందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, డిసెంబర్‌ వరకు అవకాశం ఇవ్వాలని కోరింది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌  అమెరికా పర్యటన సమయంలో గూగుల్‌ ఈ విషయాన్ని తెలియజేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గత నెలలో క్యాలిఫోర్నియాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో సీఈవో సుందర్‌పిచాయ్‌తో భేటీ అయిన విషయం గమనార్హం. గూగుల్‌ ‘గూగుల్‌పే’ (గతంలో తేజ్‌) పేరుతో చెల్లింపుల సేవలను భారత్‌లో నిర్వహిస్తోంది. 



You may be interested

ఆరునెలల కనిష్టానికి ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌

Tuesday 11th September 2018

3శాతం నష్టపోయిన ఐటీసీ ముంబై:- పలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో మంగళవారం ఎన్‌ఎస్‌ఈలోని ఫాస్ట్‌ మూవింగ్‌ కన్సూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) సూచి ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 30,845.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఎఫ్‌ఎంసీజీ షేర్లలోని ప్రధాన షేర్లైన ఐటీసీ, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రోడెక్ట్స్‌, కాల్గేట్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌(హెచ్‌యుఎల్‌), మారికో, జుబిలెంట్‌ ఫుడ్స్‌

నీషల్‌మోదీని రప్పించేందుకు సీబీఐ యత్నాలు

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: నీరవ్‌మోదీ సోదరుడు నీషల్‌ మోదీని భారత్‌కు రప్పించే విషయంలో సీబీఐ తన ప్రయత్నాలు ఆరంభించినట్టు అధికార వర్గాలు తెలిపారు. ఇందుకు సంబంధించి సీబీఐ కేంద్ర హోంశాఖకు అభ్యర్థన పంపినట్టు పేర్కొన్నాయి. సీబీఐ వినతిని కేంద్ర హోంశాఖ బెల్జియంకు పంపనుంది. నీషల్‌ మోదీ బెల్జియంలోనే తలదాచుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెల్జియం పౌరసత్వం కలిగిన నీషల్‌మోదీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. బెల్జియంతో మన దేశానికి నిందితుల/నేరస్థుల

Most from this category