STOCKS

News


చిన్న కంపెనీలకు మంచి కాలం!

Thursday 11th April 2019
news_main1554977269.png-25071

ఫలితాలు పుంజుకుంటాయి
అనిరుద్ధ నాహా
వచ్చే మూడేళ్ల పాటు చిన్న, మధ్యతరహా స్టాకులు మంచి ప్రదర్శన చూపుతాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అసెట్‌ మేనేజర్స్‌ ప్రతినిధి అనిరుధ్ద నాహా చెప్పారు. గతేడాది ఇవన్నీ భారీ పతనం చవిచూశాయని దీంతో వాల్యూషన్లు దిగివచ్చాయని చెప్పారు. ప్రస్తుతం వీటి ఎర్నింగ్స్‌ పుంజుకుంటున్నందున రాబోయే రోజుల్లో మంచి జోరు చూపుతాయన్నారు. మూడేళ్ల క్రితంతో పోలిస్తే చిన్న కంపెనీల బాలెన్స్‌ షీట్లలో గణనీయ మార్పు కనిపిస్తోందన్నారు. చాల కంపెనీల రుణభారాలు తగ్గుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో డిమాండ్‌ క్రమానుగతంగా పెరుగుతుందని, అందువల్ల ఇలాంటి కంపెనీలు మంచి ఫలితాలు నమోదు చేస్తాయని చెప్పారు. 
సూచీలకు పాజిటివ్‌ అంశాలు
- స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు.
- విధానపరమైన అస్థిరత లేకపోవడం
- ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం ఒకేరీతిలో కొనసాగడం
- క్రెడిట్‌ గ్రోత్‌లో వృద్ధి
- సాధారణ వర్షపాతం.
సూచీలకు నెగిటివ్‌ అంశాలు
- క్రూడాయిల్‌ ధరల పెరుగుదల
- అంతర్జాతీయ మందగమనం
- అస్థిర ప్రభుత్వం
- వాణిజ్యయుద్ధం.



You may be interested

మాంద్యం ఛాన్సులు మందగించాయి!

Thursday 11th April 2019

గోల్డ్‌మన్‌ సాక్స్‌ వచ్చే ఏడాదిలోపు యూఎస్‌ఎకానమీలో మాంద్యం వచ్చే అవకాశాలు పదిశాతమేనని గోల్డ్‌మన్‌ సాక్స్‌ పేర్కొంది. ఫెడ్‌ తీసుకున్న చర్యలు మాంద్యం వచ్చే పరిస్థితులను అరికట్టాయని, అందుకే గతంలో చెప్పినట్లు ఈ ఛాన్సును20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నామని సంస్థ ఎకనమిస్టులు చెప్పారు. ఫెడ్‌ తీసుకున్న అసాధారణ యూటర్న్‌ కారణంగా ఎకానమీలో పరిస్థితులు చక్కబడుతున్నాయని గోల్డ్‌మన్‌ ఒక నివేదికలో తెలిపింది. రేట్లు తగ్గించడం డౌన్‌సైడ్‌ రిస్కులను తగ్గిస్తుందని తెలిపింది. ఇకపై

ఫ్లాట్‌గా రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిస్టింగ్‌

Thursday 11th April 2019

కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో తొలి ఐపీఓగా పేరుపోందిన ప్రభుత్వరంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలలో యధాతధంగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ.19లు కాగా బీఎస్ఈలో ఇదే ధర వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.19.45 వద్ద గరిష్టాన్ని, రూ.18.60ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇష్యూ ధర(రూ.19)తో పోలిస్తే 0.75శాతం లాభంతో రూ.19.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  రైల్వే శాఖ నిధుల సమీకరణలో భాగంగా రైల్‌ వికాస్‌

Most from this category