STOCKS

News


ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం

Saturday 9th February 2019
news_main1549695692.png-24102

  • రేట్ల తగ్గింపునకు మంత్రుల బృందం సానుకూలత
  • వచ్చే వారం కౌన్సిల్‌ భేటీలో దీనిపై నిర్ణయం

న్యూఢిల్లీ: నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించేందుకు మంత్రుల బృందం తొలి భేటీలోనే సానుకూలత వ్యక్తం చేసింది. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ గత నెలలో ఏర్పాటు చేసింది. జీఎస్టీ విధానంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిశీలించి, పన్ను రేట్లపై సూచనలు చేసే బాధ్యతలు అప్పగించింది. ఈ మంత్రుల బృందం తొలి సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. వారం రోజుల్లోపే నివేదికను సిద్ధం చేసి వచ్చే వారం జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముందుంచనున్నట్టు ఓ అధికారి తెలిపారు. పన్ను రేట్లను తగ్గించేందుకు మంత్రుల బృందం సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్‌పుట్‌ ట్యా‍క్స్‌ క్రెడిట్‌ సదుపాయంతో అమలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరణ ఇచ్చిన ఇళ్లపై కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేయడం లేదు. అయితే, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ అంశాలను పరిశీలించి తగిన సూచనలకు గాను జీఎస్టీ కౌన్సిల్‌ జనవరి 10న మంత్రుల బృందాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.



You may be interested

యానివేషన్‌లో సీఏ చదువులు

Saturday 9th February 2019

– వీడియోలతో ఫైనాన్స్‌ కోర్సుల బోధన – ఇండిగోలెర్న్‌లో 12 సీఏ సబ్జెక్ట్‌లు; 20 వేల మంది విద్యార్థులు – రెండేళ్లలో విదేశీ ఫైనాన్స్, అకౌంటింగ్‌ పాఠ్యాంశాలు కూడా.. – ఏడాదిలో రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి – ‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ సీఈఓ శ్రీరామ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చార్టెర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) చదువు కాస్త గజిబిజి గందరగోళమే. ఆర్ధికం, బిజినెస్‌ లా, స్టాటిస్టిక్స్‌.. ఇలా ప్రతీ సబ్జెక్ట్‌ క్లిష్టమైందే. అయితే దీన్ని అంత్యంత సులువు

మార్కెట్లోకి హోండా సీబీ300 ఆర్‌

Saturday 9th February 2019

మధ్య స్థాయి ప్రీమియం బైక్‌ విడుదల ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.41 లక్షలు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ హోండా మధ్యస్థాయి ప్రీమియం విభాగంలో సీబీ300ఆర్‌ ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.41 లక్షలు. ఈ బైక్‌ 286సీసీ సామర్థ్యంతో ఉంటుంది. హోండా ప్రీమియం విభాగంలో సీబీ1000ఆర్‌ను ఇప్పటికే విక్రయిస్తుండగా, తాజాగా విడుదల చేసినది మధ్యస్థాయి ప్రీమియం విభాగం (300-600సీసీ) కిందకు వస్తుంది. ఇదే విభాగంలో

Most from this category