STOCKS

News


సమీపకాలం ‘‘బంగారమే’’

Friday 11th January 2019
Markets_main1547185055.png-23522

  • ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి డాలర్‌ వరకూ..
  • పసిడి డిమాండ్‌ పెరుగుదలకు దోహదం
  • వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా-

ముంబై: బంగారం డిమాండ్‌ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది.   ఈ ఏడాది (2019) డిమాండ్‌ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్‌ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్‌ కదలికలవంటి అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  • ఒడిదుడుకుల ఫైనాన్షియల్‌ మార్కెట్ల సమయంలో సహజంగా పసిడి పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచంమొత్తంగా పసిడి డిమాండ్‌ చూస్తే,  చైనా, భారత్‌సహా పలు వర్థమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది.
  • గత రెండేళ్లలో ప్రపంచంలో నెలకొన్న పలు అనిశ్చితి ఆర్థిక అంశాల ప్రభావం 2018 చివర్లో స్పష్టంగా కనిపించింది. ఇదే పరిస్థితితో 2019 సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆయా అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్‌లో పసిడి డిమాండ్‌ పెరుగుదలకే కొంత మొగ్గు ఉంది.-
  • మార్కెట్‌ అనిశ్చితి కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇది పసిడికి సానుకూల అంశమే.-
  • ఈ సందర్భంగా పసిడికి ప్రతికూలమైన వడ్డీరేట్ల పెరుగుదల, డాలర్‌ పటిష్టతను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫెడ్‌ వడ్డీరేటు (ప్రస్తుతం 2.25-2.50 శాతం శ్రేణి) పెంపు స్పీడ్‌ తగ్గే అవకాశాలే కనిపిస్తుండడం పసిడికి సానుకూల అంశమే.-
  • వృద్ధి పెరిగినా, ఆ ఫలాలు అందరికీ అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది పసిడి సెంటిమెంట్‌ను బలపరిచే అంశమే.-
  • ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇదేరీతిన కొనసాగితే, 2019లో పసిడి ఆభరణాలకూ డిమాండ్‌ పటిష్టమవుతుందని కౌన్సిల్‌ భావిస్తోంది.-
  • పశ్చిమ దేశాల్లో వృద్ధి ధోరణి... వినియోగ సెంటిమెంట్‌ను బలపరిచే అంశం.



You may be interested

ఓలాకు రూ.520 కోట్ల పెట్టుబడులు

Friday 11th January 2019

సమకూర్చిన స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మారిషస్‌  న్యూఢిల్లీ: ట్యాక్సీ అగ్రిగేటర్‌, ఓలాలో స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌ మారిషస్‌ సంస్థ రూ.520 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. మొత్తం 2.45 లక్షల సిరీస్‌ జే ప్రిఫరెన్స్‌ షేర్లను ఒక్కోటీ రూ.21,250 చొప్పున జారీ చేసి ఈ నిధులు సమీకరించామని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ (ఓలాను ఈ కంపెనీయే నిర్వహిస్తోంది) నివేదించింది. ఈ మేరకు ఈ నెల 9న జరిగిన

మారుతి కార్లు ప్రియం

Friday 11th January 2019

న్యూఢిల్లీ: ముడివస్తువుల ధరలు పెరుగుతుండటం, విదేశీ మారకం రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి అంశాల నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల రేట్లను పెంచింది. వివిధ కార్ల మోడల్స్‌పై ఈ పెంపు రూ. 10,000 దాకా (ఢిల్లీ ఎక్స్‌ షోరూం) ఉంటుందని, ఇది తక్షణమే అమల్లోకి వచ్చిందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు అన్ని మోడల్స్ ధరలు పెరగ్గా.. ఇటీవలే ప్రవేశపెట్టిన ఎర్టిగా కొత్త వెర్షన్‌ని

Most from this category