STOCKS

News


శరవేగంగా ‘మౌలికం’

Saturday 2nd February 2019
Markets_main1549107133.png-23977

  • రహదారుల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి
  • ఈ రంగానికి రూ.83,000 కోట్ల కేటాయింపు
  • రవాణాలో తరువాతి తరం సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి
  • ‘ఉడాన్‌’తో సామాన్యుడికి చేరువైన విమాన సేవలు
  • బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే..ఈశాన్యానికీ సరకు రవాణా సాధ్యమే
  • రైల్వేలకు మూలధన మద్దతుగా రూ.64,587 కోట్లు
  • ఐదేళ్లలో లక్ష డిజిటల్‌ గ్రామాలకు రూపకల్పన
  • మధ్యంతర బడ్జెట్‌లో వెల్లడించిన కేంద్రం


న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్‌ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదుచేసిందని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రైల్వేలు, జలరవాణా, వాయు రవాణా, డిజీమార్గాలు తదితర మౌలిక రంగాల్లో శీఘ్రతర పురోగతి సాధించే దిశగా దూసుకెళ్తున్నామని తెలిపారు. ఏ దైశాభివృద్ధికైనా మౌలిక వసతులే వెన్నెముక అని పేర్కొన్న గోయల్‌..వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌ చారిత్రకమైనది, విప్లవాత్మకమైనదని రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ స్వాగతించారు. దీని ద్వారా 40-50 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులు తదితరాలపై తాజా బడ్జెట్‌లో గోయల్‌ ప్రస్తావించిన విషయాలు..

-రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్‌-విద్యుత్‌ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
-మౌలిక వసతుల రంగంలో క్రమానుగత వృద్ధిని దాటి శీఘ్రాభివృద్ధిని అందుకునే దిశగా వెళ్తున్నాం.
-ఢిల్లీ, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఏళ్లుగా నిలిచిపోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
-రహదారుల నిర్మాణానికి ఈసారి రూ.83 వేల కోట్లు కేటాయించారు.
-‘ఉడాన్‌’ పథకం ద్వారా సామాన్యుడికి విమాన ప్రయాణం చేరువైంది. సిక్కింలోని పాక్యాంగ్‌ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది.
-గత ఐదేళ్లలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది.
-సుదూర తీర ప్రాంతం ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
-సాగరమాల కార్యక్రమాల్ని విస్తృతపరచి, మరిన్ని జలరవాణా మార్గాల్ని అభివృద్ధిచేయొచ్చు.
-కోల్‌కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరకు రవాణా ప్రారంభమైంది.
-బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది.
-రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది. బ్రాడ్‌గేజ్‌ నెట్‌వర్క్‌లో కాపలాలేని అన్ని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించారు.
-స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు. దీంతో ఉద్యోగ కల్పన పెరుగుతుంది.
-తాజా బడ్జెట్‌లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం రూ.64,587 కోట్లు.
-రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ రూ.1,58, 658 కోట్లు.
-అరుణాచల్‌ప్రదేశ్‌లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి.
-ఈ మేరకు ఈశాన్య భారత్‌లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి.
-వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
-ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) పథకం కింద నాలుగేళ్లలో గ్రామీణ రోడ్ల నిర్మాణం మూడింతలైంది.
-15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి.
-ఈసారి బడ్జెట్‌లో పీఎంజీఎస్‌వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు.
-2014-18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు.You may be interested

నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు

Saturday 2nd February 2019

ఓటాన్‌ అకౌంట్‌ కోరిన ప్రభుత్వం న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్‌ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019-20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్‌ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ ద్వారా పార్లమెంట్‌ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల

రైతుకు రొక్కం

Saturday 2nd February 2019

అన్నదాతకు ఏటా రూ. 6వేల ఆర్థిక సాయం ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పేరుతో కొత్త పథకం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు ఈ మార్చిలోగా రూ. 2వేలు బదిలీ.. రూ. 75,000 కోట్లు కేటాయింపు.. రైతులకు 2శాతం వడ్డీ రాయితీ చేపలు, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా.. వైపరీత్యాలలో నష్టపోయిన రైతులకు 3శాతం రాయితీ అదనం.. గో సంరక్షణ, చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి కొత్తగా

Most from this category