STOCKS

News


గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లాభం రూ.21కోట్లు

Friday 2nd November 2018
news_main1541142646.png-21661

  • రూ.487 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: గోద్రేజ్‌ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతపదికన రూ. 21 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.21 లక్షల నికర లాభం మాత్రమే వచ్చిందని గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ పేర్కొంది. ఆదాయం అధికంగా ఉండటం, పన్ను రివర్సల్‌, అధిక ఇతర ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ ఫిరోజ్‌షా గోద్రేజ్‌ చెప్పారు.  గత క్యూ2లో రూ.349 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.487 కోట్లకు పెరిగిందని వెల్లడించారు.
ఈ క్యూ2లో అమ్మకాల బుకింగ్‌లు రూ.807 కోట్లుగా ఉన్నాయని ఫిరోజ్‌షా తెలియజేశారు. గత క్యూ2లో ఈ బుకింగ్‌లు రూ.1,335 కోట్లని, 14 శాతం క్షీణత నమోదైందని చెప్పారు. ఇతర ఆదాయం 161 శాతం పెరిగి రూ.94 కోట్లకు చేరుకుంది. గత క్యూ2లో పన్ను వ్యయాలు రూ.3.6 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.17 కోట్ల ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించింది.  గత క్యూ2లో ఎబిటా రూ.13.3 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.11.6 కోట్ల నష్టాలు వచ్చాయి. వడ్డీ, అమ్మకాల వ్యయాలు పెరగడం దీనికి కారణాలని ఫిరోజ్‌ షా చెప్పారు. వడ్డీ వ్యయాలు 54 శాతం పెరిగి రూ,.62 కోట్లకు ఎగిశాయని పేర్కొన్నారు. తమ వ్యాపార అభివృద్ధికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నామని, అమ్మకాల పరంగా మంచి వృద్ధిని సాధించనున్నామని తెలిపారు.



You may be interested

ఏవియేషన్‌కు ఈ ఏడాది కష్టమే: క్రిసిల్‌

Friday 2nd November 2018

- 2018-19లో భారీ నష్టాలు రావచ్చు - దశాబ్ద కాలంలోనే ఇదే అత్యధికం - ధరల పెంపుతో బయటపడే అవకాశం - రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ నివేదిక ముంబై: ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలు మూటగట్టుకోనున్నాయని రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి విలువ జీవిత కాలంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడం నష్టాలకు కారణాలుగా తెలిపింది. విమాన టికెట్‌ చార్జీలను 12 శాతం

భారత్‌లో పసిడి ధగధగలు

Friday 2nd November 2018

సెప్టెంబర్‌ త్రైమాసికంలోడిమాండ్‌ 10 శాతం వృద్ధి డబ్ల్యూజీసీ నివేదిక పండుగల సీజన్‌ అవుట్‌లుక్‌ అంతంతే! ధరల పెరుగదల ప్రధాన కారణం ముంబై: దేశంలో సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో  బంగారానికి  పటిష్ట డిమాండ్‌ నమోదయ్యింది. ఈ కాలంలో 10 శాతం వృద్ధి నమోదయినట్లు (2017 ఇదే కాలంతో పోల్చి) వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. పరిమాణం రూపంలో 183.2 టన్నులు. అయితే ప్రస్తుత పండుగల సీజన్‌లో మాత్రం బంగారం డిమాండ్‌ అంతంతే

Most from this category