STOCKS

News


59 శాతం పెరిగిన గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం

Tuesday 13th November 2018
news_main1542085349.png-21931

న్యూఢిల్లీ: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిటేడెట్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 59 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.190 కోట్లకు పెరిగిందని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.58 కోట్లుగా ఉన్న పన్ను వ్యయాలు ఈ క్యూ2లో 1.45 కోట్లకు తగ్గాయని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.2,353 కోట్ల నుంచి రూ.2,757 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.8 శాతం నష్టంతో రూ.464 వద్ద ముగిసింది.



You may be interested

జీఎస్‌ఎంఏ బోర్డులో 3 దేశీ టెల్కో దిగ్గజాలు

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య జీఎస్‌ఎంఏ బోర్డులో మూడు దేశీ ప్రైవేట్‌ టెల్కో దిగ్గజాలు చోటు దక్కించుకున్నాయి. భారతి ఎయిర్‌టెల్‌ ఎ౾ండీ, సీఈవో గోపాల్ విఠల్‌, రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్‌, వొడాఫోన్ గ్రూప్ సీఈవో (ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం) వివేక్ బద్రినాథ్ జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వొడాఫోన్ ఐడియా బోర్డులో బద్రినాథ్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కూడా ఉన్నారు. దీంతో మొత్తం మూడు

యూకో బ్యాంక్‌కు మొండి సెగ

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ నష్టాలు ఈ క్యూ2లో మరింతగా పెరిగాయి. గత క్యూ2లో రూ.623 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ2లో రూ.1,136 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూకో బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు పెరిగాయని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.3,758 కోట్ల నుంచి రూ.3,749 కోట్లకు తగ్గింది.  తగ్గిన రుణ నాణ్యత  బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా

Most from this category