STOCKS

News


హైదరాబాద్‌లో జీఎంఆర్‌ బిజినెస్ పార్క్

Saturday 11th May 2019
Markets_main1557554242.png-25675

  • రూ. 350 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌
  • ఆరు టవర్ల నిర్మాణం
  • మరో రెండున్నరేళ్లలో అందుబాటులోకి

హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న మిగులు స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో ఏరోడ్రోమ్‌లో 'బిజినెస్ పార్క్‌' ఏర్పాటు చేయడంపై జీఎంఆర్ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్ఐఏఎల్‌) కసరత్తు చేస్తోంది. దీనిపై సుమారు రూ. 350 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎ౾ంఆర్‌ స్థల అభివృద్ధి విభాగం సీఈవో అమన్ కపూర్‌ తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్‌తో ఆరు భవంతులు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఒక టవర్ పూర్తయ్యిందని, అందులో కొంత భాగంలో జీఎంఆర్ గ్రూప్ సంస్థ ఒకటి కార్యకలాపాలు సాగిస్తోందని అమన్‌ కపూర్ చెప్పారు. 
    మొత్తం ప్రాజెక్టు పూర్తయి, అందుబాటులోకి రావడానికి మరో రెండు, రెండున్నరేళ్ల సమయం పట్టవచ్చని ఆయన తెలిపారు. పెట్టుబడిలో కొంత భాగం నిధులను అంతర్గత వనరుల ద్వారాను, మిగతాది రుణ మార్గంలోనూ సమీకరిస్తున్నట్లు వివరించారు. సిద్ధమవుతున్న రెండో టవర్‌లో ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చేందుకు పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఐఏఎల్‌లో భాగమైన జీఎంఆర్‌ హైదరాబాద్ ఏరోట్రోపోలిస్‌ సంస్థ.. ఎయిర్‌పోర్టులోని 1,500 ఎకరాల స్థలంలో వాణిజ్యం, రిటైల్‌, వినోదం, ఆతిథ్యం, విద్య, వైద్యం, సరకు రవాణా వంటి అన్ని సదుపాయాలతో సమగ్రమైన వ్యవస్థను రూపొందిస్తోందని వివరించారు. 



You may be interested

లోన్‌ కావాలా నాయనా!

Saturday 11th May 2019

24 బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీలతో మైలోన్‌కేర్‌ ఒప్పందం గతేడాది వెయ్యి కోట్లు; ఈ ఏడాది రూ.2500 కోట్ల పంపిణీ లక్ష్యం 25 లక్షల మంది కస్టమర్లు; తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం ఇప్పటివకే రూ.8 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ గుప్తా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణం విషయంలో సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్‌ ప్రతీ ఒక్కటీ కౌంట్‌ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా

బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎయిరిండియా

Saturday 11th May 2019

చివరి నిమిషం బుకింగ్స్‌పై 50% డిస్కౌంట్‌ ముంబై: విమాన డిపార్చర్‌కు మూడు గంటల ముందు బుకింగ్స్‌పై 50 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుక్రవారం ప్రకటించింది. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్యాసింజర్లకు ఈ ఆఫర్‌ ఎంతగానో ఉపయోగపడనుందని.. సంస్థకు చెందిన కౌంటర్లు, వెబ్ సైట్, మొబైల్ యాప్‌, ఎజెంట్ ద్వారా జరిగే బుకింగ్స్‌కు ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. ‘హ్యఫ్టీ డిస్కౌంట్‌’ పేరుతో ఈ ఆఫర్‌

Most from this category