STOCKS

News


జీఎంఆర్‌ చేతికి క్రీతి విమానాశ్రయ ప్రాజెక్టు

Saturday 23rd February 2019
news_main1550900602.png-24288

టెర్నా గ్రూప్‌తో కలిసి నిర్మాణం
ప్రాజెక్టు వ్యయం రూ.4,034 కోట్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న జీఎంఆర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మరో విమానాశ్రయ ప్రాజెక్టు వచ్చి చేరింది. గ్రీస్‌లోని క్రీతి రాజధాని నగరమైన హిరాక్లియోలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాంట్రాక్టును దక్కించుకుంది. గ్రీక్‌ కంపెనీ టెర్నా గ్రూప్‌తో కలిసి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ మేరకు ఇరు సంస్థలు కన్సెషన్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఒప్పందం కింద విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, కార్యకలాపాలు, నిర్వహణను రెండు సంస్థల జాయింట్‌ వెంచర్‌ కంపెనీ చేపడుతుంది. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.4,034 కోట్లు. కన్సెషన్‌ పీరియడ్‌ 35 ఏళ్లు. ఈక్విటీ, ప్రస్తుత విమానాశ్రయం నుంచి అంతర్గత వనరులు, గ్రీస్‌ గవర్నమెంటు ఇచ్చే గ్రాంటు ద్వారా నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు రుణం అవసరం లేదని కంపెనీ తెలిపింది. 


రెండవ అతిపెద్ద విమానాశ్రయం..
అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతాల్లో గ్రీస్‌ ముందు వరుసలో ఉంటుంది. ఏటా ఇక్కడికి 2.7 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారు. గ్రీస్‌లో ఎక్కువ మంది పర్యటిస్తున్న ద్వీపాల్లో క్రీతి టాప్‌లో ఉంది. హిరాక్లియో విమానాశ్రయం గ్రీస్‌లో రెండవ అతిపెద్దది. మూడేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా 10 శాతం వృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా విమానాశ్రయ సామర్థ్యం సరిపోవడం లేదు. యూరప్‌ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ప్రాజెక్టు అని జీఎంఆర్‌ ఎనర్జీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ బిజినెస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో మరింత విస్తరిస్తామని చెప్పారు.



You may be interested

చందా కొచర్‌పై లుక్‌ అవుట్ నోటీసు

Saturday 23rd February 2019

 దీపక్‌ కొచర్‌, వీడియోకాన్ ఎండీ ధూత్‌లపై కూడా  దేశం విడిచి వెళ్లనివ్వకుండా జారీ చేసిన సీబీఐ న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ తాజాగా లుక్‌ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్‌, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ

రుణ నిర్వహణకు స్వతంత్ర సంస్థ..

Saturday 23rd February 2019

2040 నాటికి 650 బిలియన్ డాలర్లకు రియల్టీ మార్కెట్‌.. ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2040 నాటికి అయిదు రెట్లు వృద్ధితో 650 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న ఏఽడు శాతం నుంచి రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన వివరించారు. ఇండియా సోత్‌బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన అంతర్జాతీయ లగ్జరీ

Most from this category