STOCKS

News


జీఎంఆర్‌కు దక్కని ఫిలిపిన్స్‌ విమానాశ్రయ నిర్వహణ

Wednesday 11th July 2018
news_main1531327219.png-18214

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిలిప్పిన్స్‌లోని క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్‌ గ్రూప్‌కు దక్కలేదు. కాంట్రాక్ట్‌ నిర్వహణ బాధ్యతల కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ వేసిన బిడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ అందించే స్కైట్రాక్‌ రేటింగ్‌లో క్వాలిఫై కాకపోవటమే ఇందుకు కారణమని తెలియవచ్చింది. కానీ, జీఎంఆర్‌ దాని ఫిలిప్పిన్స్‌ పార్ట్‌నర్‌ మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ క్లార్‌ విమానాశ్రయ ఈపీసీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికైతే క్లార్క్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతల కోసం కొత్త భాగస్వామి కోసం ప్రయత్నించటం లేదని మెగావైడ్‌ తెలిపింది. కానీ, పలువురు ఆపరేటర్లు మాత్రం భాగస్వామ్యం కోసం సంప్రతించినట్లు మెగావైడ్‌ రెగ్యులేటరీకి తెలిపింది.



You may be interested

ఆధార్‌తో రూ.90 వేల కోట్లు ఆదా

Wednesday 11th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో రోజుకు సగటున 3 కోట్ల మంది ఆధార్‌ను వినియోగిస్తున్నారని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ– ఆధార్‌) చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జె.సత్యనారాయణ చెప్పారు. రేషన్, పెన్షన్, రూరల్‌ ఎంప్లాయిమెంట్, స్కాలర్‌షిప్‌ వంటి వాటికి ఎక్కువగా ఆధార్‌ను వినియోగిస్తున్నారన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో (ఐఎస్‌బీ) డిజిటల్‌ ఐడెంటిటీ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆధార్‌

'విస్తార' భారీ విస్తరణ!

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ 'విస్తార'... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్‌బస్‌, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను

Most from this category