STOCKS

News


రుణభారం తగ్గటానికి జీఎంఆర్‌ తంటాలు!

Thursday 21st February 2019
news_main1550768013.png-24269

 - ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా విక్రయానికి ప్రయత్నాలు
- సింగపూర్‌ జీఐసీ, జపాన్‌ మిత్సుబిషి ఆసక్తి!!
- రూ.5వేల కోట్ల వరకూ సమీకరించే అవకాశం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారీగా పేరుకుపోయిన రుణాలను తగ్గించుకోవటానికి తంటాలు పడుతున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా... తనకు బాగా లాభసాటిగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారంలో వాటా విక్రయించే ప్రయత్నాలు మొదలెట్టింది. మైనారిటీ వాటా కొనుగోలు చేయాలని సింగపూర్‌కు చెందిన జీఐసీ, జపాన్‌ కంపెనీ మిత్సుబిషి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.4 వేల నుంచి రూ.5వేల కోట్లు సమీకరించాలని, తద్వారా తనకున్న రూ.20వేల కోట్ల నికర రుణాల్లో కొంతైనా తీర్చాలని జీఎంఆర్‌ ఇన్‌ప్రా భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలియజేశాయి. 
నిజానికి తన ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌ కంపెనీని డీమెర్జ్‌ చేసి, విడిగా లిస్ట్‌ చేసే ఆలోచన ఉందని ఈ మధ్యనే జీఎంఆర్‌ బయటపెట్టింది. దీన్నెలాగూ లిస్టెడ్‌ సంస్థ నుంచే డీమెర్జ్‌ చేస్తున్నారు కనక పబ్లిక్‌ ఆఫర్‌ ప్రసక్తి ఉండదు. దీనిపై వాటాదారుల అభిప్రాయాలను కూడా తీసుకున్న కంపెనీ... లాభ నష్టాల్ని బేరీజు వేయటానికి ఒక కమిటీని నియమించింది. దేశీయంగా జీఎంఆర్‌ చేతిలో ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాలున్నాయి. నాగ్‌పూర్‌, గోవాల్లో ఎయిర్‌పోర్టులను నిర్మించే కాంట్రాక్టుల్ని ఈ సంస్థ దక్కించుకుంది. మొత్తంగా ఎయిర్‌పోర్టుల హోల్డింగ్‌ కంపెనీలో ఇన్‌ఫ్రాకు 91.95 శాతం వాటాలుండగా... హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాత్రం 11 శాతం వాటా మలేసియా ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ చేతుల్లోను, మరికొంత వాటా అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ చేతుల్లోను ఉంది.
ఇటీవలే వాటా విక్రయించిన జీవీకే
స్పెయిన్‌ దిగ్గజం ఫెరోవియల్‌, కెనడాకు చెందిన పింఛన్‌ ఫండ్‌ పీఎస్‌పీ, ఎమిరేట్స్‌ కేంద్రంగా కొనసాగుతున్న సావరిన్‌ ఫండ్‌ అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ఈ నెల మొదట్లో జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాకు చెందిన ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారంలో మైనారిటీ వాటా కోసం బిడ్లు సమర్పించాయి. ఇపుడు ఎయిర్‌పోర్టు వ్యాపారంలో చక్కని వృద్ధితో పాటు లాభాలూ వస్తుండటమే దీనిక్కారణం. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుల వ్యాపారం ద్వారా అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి రూ.365 కోట్ల పన్ను ముందరి లాభాన్ని ప్రకటించగా.. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ.394 కోట్లుగా ఉంది. ఇక జీవీకే గతేడాది ఇదే క్వార్టర్లో రూ.260 కోట్ల నష్టాన్ని చూసి... ఈ సారి మాత్రం రూ.274 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 



You may be interested

తక్కువ ధరల వద్ద ప్రమోటర్ల కొనుగోళ్లు

Friday 22nd February 2019

మార్కెట్‌ పరిణామాలతో కొన్ని స్టాక్స్‌ దారుణంగా పడిపోవడం ఆయా కంపెనీల ప్రమోటర్లను ఆలోచింపజేసింది. దీంతో తక్కువ ధరల వద్ద తమ కంపెనీల్లో వాటాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నారు. ఆ వివరాలను గమనిస్తే...    జనవరి 1 నుంచి సుమారు 150 కంపెనీల ప్రమోటర్లు ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు లేదా బైబ్యాక్‌, ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా వాటాలు పెంచుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉదాహరణకు టాటా

బాకీ కట్టకపోతే జైలు శిక్షే!

Thursday 21st February 2019

- ఎరిక్సన్‌ కేసులో అనిల్‌ అంబానీకి సుప్రీం హెచ్చరిక - 4 నెలల్లో రూ.453 కోట్లు కట్టాల్సిందేనని స్పష్టీకరణ - లేదంటే మూడు నెలల జైలు తప్పదని వెల్లడి - మరో ఇద్దరు గ్రూప్‌ కంపెనీల చీఫ్‌లకూ ఇదే వార్నింగ్‌ - వీరంతా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ ఆగ్రహం న్యూఢిల్లీ: ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన బకాయిల కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, వ్యాపారవేత్త అనిల్‌ అంబానీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్‌ దాఖలు

Most from this category