News


జీఎంఆర్‌ చేతికి నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌!

Tuesday 2nd October 2018
news_main1538450767.png-20768

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు అత్యధిక మొత్తాన్ని కోట్‌ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాగ్‌పూర్‌లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధి, కార్యకలాపాలు, నిర్వహణను అత్యధిక మొత్తం కోట్‌ చేసిన కంపెనీ చేపడుతుంది. 30 ఏళ్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టులో భాగంగా కొత్తగా టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉంటుంది. జీవీకే సైతం నాగ్‌పూర్‌ ప్రాజెక్టును దక్కించుకోవడానికి పోటీ పడింది. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరించేందుకు మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల సంయుక్త భాగస్వామ్య కంపెనీ మల్టీ మోడల్‌ ఇంటర్నేషనల్‌ హబ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎట్‌ నాగ్‌పూర్‌ (మిహాన్‌ ఇండియా) ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియను 2018 మార్చిలో ప్రారంభించింది. నాగ్‌పూర్‌ విమానాశ్రయం నుంచి 2017-18లో 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 7,800 టన్నుల కార్గో రవాణా జరిగింది. ఇక్కడి ఎయిర్‌పోర్టులో అయిదేళ్లుగా ప్రయాణికుల సంఖ్య ఏటా 11 శాతం పెరుగుతూ వస్తోంది. కార్గో రవాణా పరంగా దేశంలో 17వ స్థానంలో ఉంది.



You may be interested

యూపీఐ లావాదేవీల్లో 30% వృద్ధి

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే నగదు లావాదేవీలు సెప్టెంబరులో 30 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) వెల్లడించిన సమాచారం ప్రకారం గత నెలలో 40.58 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఈకాలంలో జరిగిన మొత్తం నగదు బదిలీ రూ.59,835 కోట్లుగా నిలిచాయి. అంతకుముందు నెలలో (ఆగస్టు) యూపీఐ లావాదేవీలు 31.20 కోట్లు కాగా, రూ.54,212.26 కోట్ల నగదు బదిలీ జరిగింది.

హైదరాబాద్‌లో ఒపో ఆర్‌అండ్‌డీ సెంటర్‌

Tuesday 2nd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఒపో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం త్వరలో ప్రారంభానికి కూడా సిద్ధమవుతోంది. కంపెనీకి ఇది భారత్‌లో తొలి సెంటర్‌ కాగా, ప్రపంచవ్యాప్తంగా ఏడవది. చైనాలో నాలుగు, జపాన్‌, యూఎస్‌లో ఒక్కో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. భారత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉపకరణాల అభివృద్ధిలో హైదరాబాద్‌ సెంటర్‌ నిమగ్నం కానుంది. శామ్‌సంగ్‌

Most from this category